Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్షణ శక్తినిచ్చే మునగాకు పొడి

మునగాకును పొడి రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. మునగాకు పొడి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి...


మునగాకులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్‌ మునగాకుల్లో లభిస్తుంది. ఇది సహజసిద్ధంగా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్‌ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. డయాబెటిస్‌ రోగులకు ఇది మంచి ఆహారం. 

మునగాకు పొడి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులో ఉండే ఐరన్‌, మెగ్నీషియం అలసటను, నీరసాన్ని దూరం చేస్తాయి.

శరీరంలో ఉన్న మలినాలు వేగంగా బయటకు పంపడంలో మునగాకు పొడి సహాయపడుతుంది. కాలేయంతో పాటురీరవ్యవస్థ మొత్తం శుభ్రపడుతుంది.

మునగాకు పొడి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణసంబంధ సమస్యలు దూరమవుతాయి.  

మునగాకులో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. శిరోజాల ఆరోగ్యానికి అవసరమైన కెరాటిన్‌ ఏర్పడటానికి ఇందులో ఉండే అమైనో యాసిడ్స్‌ సహాయపడతాయి. 

మునగాకు మూడ్‌ బూస్టర్‌గానూ పనిచేస్తుంది. శరీరంలో ఫీల్‌గుడ్‌ హార్మోన్లను స్టిమ్యులేట్‌ చేస్తుంది. ఇందులో ఉండే అమైనో యాసిడ్‌ ట్రిప్టోఫాన్‌, సెరటోనిన్‌, మెలటోనిన్‌ ఉత్పత్తికి చాలా అవసరం.

Advertisement
Advertisement