విజ్ఞాన్‌లో వాతావరణం తెలిపే పరికరాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-09-27T06:01:07+05:30 IST

విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వాతావరణంలో మార్పులు తెలిపే పరికరాలను ఏర్పాటు చేసినట్టు బ్రానెక్స్‌ కమ్యూనిటీ కళాశాల (బీసీసీ) న్యూయార్క్‌ అధ్యక్షుడు థామస్‌ ఐసెకెనెగ్బే తెలిపారు.

విజ్ఞాన్‌లో వాతావరణం తెలిపే పరికరాల ఏర్పాటు
బ్రానెక్స్‌ కమ్యూనిటీ కళాశాల అధ్యక్షుడితో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న రత్తయ్య

అగనంపూడి, సెప్టెంబరు 26: విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వాతావరణంలో మార్పులు తెలిపే పరికరాలను ఏర్పాటు చేసినట్టు బ్రానెక్స్‌ కమ్యూనిటీ కళాశాల (బీసీసీ) న్యూయార్క్‌ అధ్యక్షుడు థామస్‌ ఐసెకెనెగ్బే తెలిపారు.  సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్యతో కలిసి ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే బీసీసీ ఒప్పందం చేసుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్‌ ఐసెకెనెగ్బే మాట్లాడుతూ భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో దువ్వాడ విజ్ఞాన్‌ కళాశాలలో మాత్రమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ పరమిత సేన్‌, నీల్‌ ఫిలిప్స్‌లు వాతావరణంలో మార్పులు, పరికరాల వినియోగం, ఉపయోగాలను వివరించారు. విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలతో బీసీసీ కళాశాల ఒప్పందం చేసుకోవడం శుభపరిణామన్నారు. అనంతరం అతిథితులను చైర్మన్‌ రత్తయ్య సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీ ప్రొఫెసర్లు షకేలా మర్చంట్‌, తరేంద్ర లఖంకర్‌, విజ్ఞాన్‌ రెక్టార్‌ వి.మధుసూదనరావు, సీఈవో శ్రీకాంత్‌, ప్రిన్సిపాల్‌ అరుంధతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.మధుసూదనరావు, ప్రసాద్‌, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T06:01:07+05:30 IST