Russiaలో ఇన్‌స్టాగ్రామ్ సేవల నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-14T12:48:53+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది....

Russiaలో ఇన్‌స్టాగ్రామ్ సేవల నిలిపివేత

మాస్కో: ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేసింది. రష్యాలోని 80 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు సేవలను నిలిపివేశామని ఆ కంపెనీ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంపై సైనికదాడి చేసిన రష్యాలో ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియా ఖాతాలను గత వారం నిలిపివేశాయి. ఇన్‌స్టాగ్రామ్ సేవల నిలిపివేత ప్రకటనకు ముందు రష్యా యూజర్ల ఫొటోలు, వీడియోలను సొంత పోటీ ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లకు మారమని సూచించింది. ఇన్‌స్టాగ్రామ్ సేవల నిలిపివేతపై రష్యా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రష్యాలో సేవలు నిలిపివేసిన యూఎస్ టెక్ దిగ్గజ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలని రష్యా న్యాయవాదులు కోర్టును కోరారు.


Updated Date - 2022-03-14T12:48:53+05:30 IST