Instagram లో మహిళలకు వేధింపులు.. ముఖం కనిపించకుండా..!

ABN , First Publish Date - 2022-03-11T14:27:33+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని మహిళలను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను

Instagram లో మహిళలకు వేధింపులు.. ముఖం కనిపించకుండా..!

  • సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ : ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని మహిళలను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూ పాల్వంచకు చెందిన తల్లూరి సాయికృష్ణ హైదరాబాద్‌లో టీసీఎస్‌ కంపెనీలో సిస్టం ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ను క్రియేట్‌ చేసి గుర్తుతెలియని మహిళల ఇన్‌స్టాగ్రామ్‌లను శోధించేవాడు. తనకు నచ్చిన మహిళలకు అసభ్య పదాలతో, అశ్లీల మెసేజ్‌లు పంపుతూ వేధించేవాడు. తన ముఖం కనిపించకుండా న్యూడ్‌కాల్స్‌ చేసేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతని వేధింపులు భరించలేక ఓ మహిళ రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. సీపీ ఆదేశాలతో ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ రంగంలోకి దిగి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2022-03-11T14:27:33+05:30 IST