Instagram లో యువతి పరిచయం.. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం

ABN , First Publish Date - 2022-03-02T12:23:50+05:30 IST

ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా పరిచయం అయిన ఓ యువతిని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకువెళతానని చెప్పి

Instagram లో యువతి పరిచయం.. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా పరిచయం అయిన ఓ యువతిని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకువెళతానని చెప్పి స్నేహితుడి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి  పాల్పడ్డాడో యువకుడు. నమ్మి మోసపోయిన ఆ యువతి డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం టోలిచౌకీకి చెందిన సాజిద్‌(22)కు సంతో‌ష్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయింది.


ఆ పరిచయంతో వారు వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారు. సాజిద్‌ యువతి ఇంటికి వెళ్లి ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకువెళతానని చెప్పి, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌కు తీసుకువచ్చాడు. స్నేహితుడికి చెందిన గదిలోకి తీసుకువెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. యువతి డయల్‌ 100కు ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాజిద్‌ను అరెస్ట్‌ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య తెలిపారు. 

Updated Date - 2022-03-02T12:23:50+05:30 IST