Million dollar fraud: దోషిగా తేలిన ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ!

ABN , First Publish Date - 2021-07-30T17:57:03+05:30 IST

నైజీరియన్ ఇన్‌స్టాగ్రామ్ సెటబ్రిటీ రామన్ అబ్బాస్ మిలియన్ డాలర్ల స్కామ్‌లో దోషిగా తేలాడు. సోషల్ మీడియాలో 'హుష్‌పప్పి'గా పేరొందిన అబ్బాస్ ఓ ఖతార్ వ్యాపారవేత్తను 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మోసానికి పాల్పడినట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

Million dollar fraud: దోషిగా తేలిన ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ!

లాస్ ఏంజిల్స్: నైజీరియన్ ఇన్‌స్టాగ్రామ్ సెటబ్రిటీ రామన్ అబ్బాస్ మిలియన్ డాలర్ల స్కామ్‌లో దోషిగా తేలాడు. సోషల్ మీడియాలో 'హుష్‌పప్పి'గా పేరొందిన అబ్బాస్ ఓ ఖతార్ వ్యాపారవేత్తను 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మోసానికి పాల్పడినట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అలాగే వరల్డ్‌వైడ్‌గా బ్యాంకు ఖాతాల ద్వారా  మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేల్చింది. దీనిద్వారా సుమారు 24 మిలియన్ డాలర్లు మోసగించినట్లు న్యాయశాఖ పేర్కొంది. గతేడాది జూన్‌లో యూఏఈ పోలీసులు దుబాయ్‌లోని అబ్బాస్ అపార్ట్‌మెంట్‌లో జరిపిన తనిఖీల్లో అరెస్ట్ అయ్యాడు.


ఆ సమయంలో అతని వద్ద 41 మిలియన్ డాలర్ల నగదు, సుమారు 6.8 మిలియన్ డాలర్లు విలువ చేసే 13 లగ్జరీ కార్లు, మోసానికి పాల్పడినట్లు చూపే లక్షకు పైగా డిజిటల్ ఫైల్స్ దొరికాయి. అనంతరం ఎఫ్‌బీఐ అధికారులు మనీలాండరింగ్, సైబర్ నేరాల ఆరోపణలపై విచారణ కోసం అబ్బాస్‌ను లాస్ ఏంజిల్స్ తరలించారు. తాజాగా కోర్టు విచారణలో అతను దోషిగా తేలాడు. దోషిగా తేలిన అబ్బాస్‌కు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Updated Date - 2021-07-30T17:57:03+05:30 IST