అర్ధనగ్న చిత్రం కోసం డిమాండ్! దిగొచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఎట్టకేలకు..

ABN , First Publish Date - 2020-08-10T16:28:56+05:30 IST

ఓ నల్ల జాతి మోడల్‌కు చెందిన అర్థనగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ అకస్మాత్తుగా తొలగించడం పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్ల డిమాండ్లకు తలొగ్గిన ఇన్‌స్టా..వాటిని తిరిగి వాటిని పునరుద్ధరించింది.

అర్ధనగ్న చిత్రం కోసం డిమాండ్! దిగొచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఎట్టకేలకు..

న్యూఢిల్లీ: ఓ నల్ల జాతి మోడల్‌కు చెందిన అర్ధనగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల అకస్మాత్తుగా తొలగించడం పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కలకలం సృష్టించారు. దీంతో వారి డిమాండ్లకు తలొగ్గిన ఇన్‌స్టా..వాటిని తిరిగి వాటిని పునరుద్ధరించింది.


అంతకుమునుపు..నల్లజాతియ మోడల్ నియోమీ నికొలస్ విలియమ్స్‌కు చెందిన అర్ధనగ్న ఫొటోలను ఆమె ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాలో పెట్టారు. ఇవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. లైకులు షేర్లతో ఆమె ఫాలోవర్లు, నెటిజ్లను తమ మద్దతు తెలిపారు. ఇంతలో ఇన్‌స్టా నియోమీకి ఊహించని షాకిచ్చింది. ఆమెకు ముందస్తు సమాచారమేదీ ఇవ్వకుండానే ఫోటోలను అకౌంట్‌ నుంచి తొలగించింది. బలవంతపు సెన్సార్‌కు పూనుకుంది. దీంతో నియోమీ ఇన్‌స్టాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


‘ఇన్‌స్టాలో ప్రతిరోజు శ్వేతజాతి మహిళల నగ్న చిత్రాలు కోట్ల సంఖ్యలో అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ తన సౌందర్యాన్ని గర్వంగా ప్రదర్శించిన నల్లజాతి మహిళ మాత్రం నిషేధానికి గురైంది. నేను చాలా షాకైపోయా. నా గొంతునెవరో నొక్కేస్తున్నట్టు అనిపిస్తోంది’ అని కామెంట్ పెట్టింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ ఉద్యమం రగులుతున్న వేళ ఈ ఘటన ఇన్‌స్టాలో కలకలం రేపింది. నియోమీ మద్దతుదార్లు, నెటిజన్లు ఆమె తరుఫున నిరసన గళం వినిపించారు. ఇన్‌స్టాలో కల్లోలం సృష్టించారు.


ఐవాంట్‌టూసీనియోమీ అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అయింది. ఇలా క్షణక్షణానికీ నిరసనల హోరు తీవ్రమవుతుండటంతో దిగొచ్చిన ఇన్‌స్టా ఆ చిత్రాలను పునరుద్ధరించింది. మరోవైపు.. జూన్‌లో ఓసారి సీఈఓ ఆడమ్ మొస్సెరీ కూడా ఇటువంటి ఘటనలపై స్పందించారు. అభ్యంతరకరమైన సమాచారం గుర్తించే ఆల్గొరిథమ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఇటువంటి విధానాలు ఏమైనా ఉంటే గుర్తించి తొలగించేందుకు ఇన్‌స్టా ఇటీవల ఓ ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసింది. 

Updated Date - 2020-08-10T16:28:56+05:30 IST