యూజర్లను సెల్ఫీ వీడియోలు అడుగుతున్న ఇన్‌స్టాగ్రామ్!

ABN , First Publish Date - 2021-11-17T20:35:03+05:30 IST

అకౌంట్ వెరిఫికేషన్ కోసం వివిధ కోణాల్లో సెల్ఫీ వీడియోలు

యూజర్లను సెల్ఫీ వీడియోలు అడుగుతున్న ఇన్‌స్టాగ్రామ్!

న్యూఢిల్లీ : అకౌంట్ వెరిఫికేషన్ కోసం వివిధ కోణాల్లో సెల్ఫీ వీడియోలు తీసుకుని, అప్‌లోడ్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్ యాప్ కోరుతున్నట్లు కొందరు యూజర్లు చెప్పారు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ గత ఏడాది నుంచి పరీక్షిస్తోంది. స్పామ్, ఫేక్ అకౌంట్లను తగ్గించేందుకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. కానీ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ వివరాలను ఎక్స్‌డీఏ డెవలపర్స్ వెల్లడించింది. 


యూజర్లు తమ సెల్ఫీ వీడియోలను అప్‌లోడ్ చేస్తే, వారి గుర్తింపును ఇన్‌స్టాగ్రామ్ తనిఖీ చేస్తుందని తెలిపింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించదని, 30 రోజుల తర్వాత సర్వర్ల నుంచి తొలగిస్తారని పేర్కొంది. 


మరోవైపు ఓ యూజర్ ఏక కాలంలో ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడాన్ని నిరుత్సాహపరిచేందుకు కొత్త ఫీచర్‌ రాబోతోంది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడం మొస్సేరి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ కాలం గడిపినవారికి విరామం తీసుకోవాలని గుర్తు చేసే ఫీచర్ రాబోతోంది. ‘టేక్ ఏ బ్రేక్’ ఫీచర్ డిసెంబరునాటికి అందుబాటులోకి రావచ్చు. 


Updated Date - 2021-11-17T20:35:03+05:30 IST