Mumbai Slum To Microsoft.. ఇది షహీనా అత్తర్వాలా విజయగాథ

ABN , First Publish Date - 2022-01-30T20:32:02+05:30 IST

కృషి, పట్టుదల.. ఈ రెండూ ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు’ అని పెద్దలు చెబుతూ ఉంటే ఈ మాటలు అక్కడున్న యువతి చెవిలో పడ్డాయి. దీంతో ఆ మాటలనే గట్టిగా నమ్మి.. శక్తివంచన లేకుండా కృ

Mumbai Slum To Microsoft.. ఇది షహీనా అత్తర్వాలా విజయగాథ

ఇంటర్నెట్ డెస్క్: ‘కృషి, పట్టుదల.. ఈ రెండూ ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు’ అని పెద్దలు చెబుతూ ఉంటే ఈ మాటలు అక్కడున్న యువతి చెవిలో పడ్డాయి. దీంతో ఆ మాటలనే గట్టిగా నమ్మి.. శక్తివంచన లేకుండా కృషి చేసింది. చివరకి అనుకున్నది సాధించింది. స్లమ్ ఏరియా నుంచి మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టి నలుగురుకీ ఆదర్శంగా నిలిచింది. ఆమె విజయగాథకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఆమె పేరు షహీనా అత్తర్వాలా. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైలోని బంద్రా రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న మురికి వాడల్లోకి వలస వచ్చింది. షహీనా అత్తర్వాలా తండ్రి సైకిల్‌పై తిరుగుతూ నూనే అమ్ముతూ.. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కష్టాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి.. తన జీవితాన్ని తానే మార్చుకోవాలని షహీనా నిర్ణయించుకుంది. ఎంత కష్టమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలని సంకల్పించుకుంది. చివరికి అనుకున్నది సాధించింది. డిగ్రీ పూర్తి చేసి.. దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించింది. మైక్రోసాఫ్ట్‌లో డిజైన్ లీడర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమె.. గతంలో ఆమె నివసించిన మురికి వాడల పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతోంది. 



నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా’ను తాజాగా చూసిన షహీనా తన గతం తాలూకు జ్జాపకాలను గుర్తుకుతెచ్చుకుంది. అంతేకాకుండా ఆ విషయాలను ట్విట్టర్ ద్వారా నలుగుతోనూ పంచుకుంది. ‘నేను నివసించిన ప్రాంతంలో లింగ వివక్షత, లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండేవి. నా చుట్టు ఉన్న స్త్రీలు చాలా మంది నిస్సహాయంగా, ఇతరులపై ఆధారపడేవారు. వారికంటూ సొంత నిర్ణయాలు ఉండేవి కావు. చిన్న తనంలోనే ఇవన్నీ చూసి చలించిపోయా. అందుకే వారిలా నా జీవితం తయారు కాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టా. మొదటి సారిగా కంప్యూటర్‌ను స్కూల్లో చూశా. దాన్ని నేర్చుకుంటే జీవితం బాగుంటుందని భావించా. కట్టుపని చేస్తూ వచ్చిన డబ్బులతో కంప్యూటర్‌లో శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత కంప్యూటర్ కొనుగోలు చేయడానికి పస్తులుండి మరీ డబ్బులు కూడబెట్టా. డిగ్రీ పూర్తైన తర్వాత 2015లో తొలిసారిగా మురిగి వాడల్లోంచి అడుగు బయటపెట్టా. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం లభించింది. దీంతో.. గతంలో నేను నివసించిన మురికి వాడల పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి 2021లో షిప్ట్ అయ్యాను. నేను ఇపుడు ఉంటున్న ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వస్తున్నాయి’ అంటూ షహీనా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 




Updated Date - 2022-01-30T20:32:02+05:30 IST