33 డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-09T05:29:19+05:30 IST

33 డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు

33 డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు

- అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావు 

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ అనుబంధంగా ఉన్న 33 డిగ్రీ కళాశాలల్లో గుర్తించిన లోపాలను మరోసారి తనిఖీ చేస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఇప్పటికే వర్సిటీకి అనుబంధంగా 104 డిగ్రీ కళాశాలలను వర్చువల్‌ విధానంలో తనిఖీ చేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి వివరాలను నివేదించామన్నారు. ఇందులో 33 కళాశాలలు నిబంధనలకు అనుసరించి లేనట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, యూని వర్సిటీ గుర్తించిందన్నారు. గుర్తించిన ఈ కళాశాలలను క్షేత్రస్థాయిలో 5 కమిటీలు తనిఖీ చేసి వివరాలను మరోసారి రాష్ట్ర ఉన్నత విద్యామండలికి నివేదిస్తున్నట్టు చెప్పారు. ఈ నివేదికలను ఉన్నత విద్యామండలి నియమించిన యంగ్‌ ఫెర్మామెన్స్‌ బృందం పరిశీలించి, తిరిగి వర్సిటీకి పంపిస్తుందన్నారు. ఈ నివేదికను పాలక మండలి సమావేశంలో చర్చించి పాదర్శకంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల ప్రక్రియ పూర్తయిన తర్వాత డిగ్రీ కళాశాలలను కేటగిరీలుగా విభజిస్తారని వీసీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-09T05:29:19+05:30 IST