ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-25T06:28:18+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. ఆస్పత్రులో అరకొర వసతులు, వైద్యు లు, సిబ్బంది కొరతను గుర్తిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో బయటపడుతున్న లోపాలు

కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేకుండానే సేవలు

ప్యాకేజీలకు అనుగుణంగా కొనసాగుతున్న సిజేరియన్‌లు 

విస్తుపోతున్న తనిఖీ బృందాలు 

నిజామాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. ఆస్పత్రులో అరకొర వసతులు, వైద్యు లు, సిబ్బంది కొరతను గుర్తిస్తున్నారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో శాశ్వత వైద్యులు, సిబ్బంది లేరు. ప్రసవాలకు కావాల్సిన లేబర్‌ రూంలు, అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో లేవు. అయినా కొంతమంది వైద్యులతో మాట్లాడుకుని రెగ్యులర్‌గా ఆపరేషన్‌లను చేస్తున్నారు. ఆపరేషన్‌లకు అవసరాల నిమిత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో సర్జరీ కోసం వైద్యులను తీసుకువస్తున్నారు. ప్రసవాలను పూర్తిచేస్తున్నారు. జిల్లాలో పలు ఆసుపత్రుల్లో ఇదే విధానం అవలంబిస్తుండడంతో తనిఖీలు చేస్తు న్న బృందాలు విస్తుపోతున్నాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియమించిన ఎని మిది బృందాలతో పాటు వైద్య ఆరోగ్యశాఖ తరఫున మరికొన్ని బృం దాలు తనిఖీలను చేస్తున్నాయి. జిల్లాలో సుమారు 300 వరకు ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటినీ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్నారు. స్టాఫ్‌, వై ద్యులు, ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో పేషంట్‌కేర్‌ ఏ విధంగా ఉందో చూస్తున్నారు. ఆసు పత్రికి వచ్చే రోగుల నమోదు, చికిత్స, సర్జరీలు వంటి అంశాలను తమ నివేదికలో పేర్కొంటున్నారు. బృందంలో వైద్యులతో పాటు అధికారులను నియమించడంతో ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ఆడిటింగ్‌ చేస్తున్నా రు. ప్రసవాలతో పాటు ఇతర సర్జరీలు, సాధారణ చికిత్సలపై దృష్టిసారిస్తున్నారు. సర్జరీలకు కావాల్సిన వసతులు, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూంతో పాటు ఇతర వసతులు ఉన్నాయా పరిశీలిస్తున్నారు. సర్జరీకి అవసరమైన వైద్యులు ముఖ్యంగా గైనకాలజి, సర్జరీ, అనస్థీషీయా వైద్యులు ఉన్నారో పరిశీలిస్తున్నారు.

పలు ఆసుపత్రుల్లో లోపాలు

జిల్లాలో వైద్యులు, బృందం సభ్యులు పరిశీలిస్తున్న ఆసుపత్రుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు తనిఖీలు జరిపిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చాలా వరకు లోపాలున్నట్లు గుర్తించా రు. నగరం పరిధిలో 8 ఆసుపత్రులు వైద్యులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు బృందంలోని అధికారులు గుర్తించారు. ఆ ఆసుపత్రుల్లో వైద్యులను సర్జరీ లెక్కన మాట్లాడుకుని తీసుకువచ్చి డెలివరీలు, ఇతర సర్జరీలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రుల్లో శాశ్వత వైద్యులు లేకపోవడంతో పాటు ఒకే వైద్యున్ని నియమించుకుని సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌ ఉన్న లేబర్‌ రూం లేకపోవడం, శిక్షణ పొందిన నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. ఈ ఎని మిది ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడంతో పా టు సర్జరీలు కూడా ఎక్కువశాతం చేస్తున్నట్లు తమ నివేదికల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ ప్రసవాలు చేయాల్సి ఉన్న ఈ ఆసుపత్రులతో పాటు ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఎక్కువ మొత్తంలో సిజేరియన్‌లకే మొగ్గుచూపుతున్న ట్లు బృందం సభ్యులు గమనించారు. కొంతమంది గర్భిణులు సిజేరియన్‌లకే మొగ్గుచూపినా వైద్యులు అవగాహన కల్పించకపోవడం, ప్యాకేజీలకు అనుగుణంగా నర్సింగ్‌హోంల యాజమాన్యం సిజేరియన్‌లకే మొగ్గుచూపడంతో ఇవి ఎక్కువ జరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులు మరో రెండు రోజుల్లో తనిఖీలు పూర్తికానుండడంతో అది అయిన తర్వాత బృందాల వారీగా నివేదికలు అందించనున్నారు. జిల్లాలోని ఈ ప్రైవేట్‌ ఆసుపత్రులతో పాటు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు కూడా ఇదే రీతిలో నిర్వర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని పరీక్షల కేంద్రాల్లో పాథలోజి పూర్తిచేసిన వైద్యులు ఉండాల్సి ఉన్నా ఎక్కువ కేంద్రాలు శిక్షణ పొందిన మెడికల్‌ ల్యాబోరేటరి టెక్నిషియన్‌ ద్వారానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గర్భిణులతో పాటు ఇతర రోగులు ఎక్కువ శాతం ఆర్‌ఎంపీలు, పీఎంపీ లు, ఇతర మార్కెటింగ్‌ సంబంధించిన వ్యక్తుల ద్వారానే ఈ ఆసుపత్రులకు వస్తున్నట్లు గుర్తించారు. వైద్యుల పేరు మీద ఆసుపత్రికి వచ్చేవారు తక్కువగా ఉన్నట్లు తమ నివేదికల్లో బృందం సభ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం.

ఏళ్ల తరబడి కానరాని తనిఖీలు

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ కేం ద్రాలకు అనుమతి ఇస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏళ్ల తరబడి తనిఖీలు చేయకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నట్లు తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికా రులు ప్రతి సంవత్సరం నాలుగు దఫాలు తనిఖీలు చేయడంతో పాటు నిబంధనలు లేని ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ రద్దుచేసే అవకా శం ఉన్నా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం ఇవి నడుస్తున్నట్లు గుర్తించారు. ఏ ఆసుపత్రిపైన చర్య తీసుకోకపోవడం, మామూళ్లు నెలవారీగా వస్తుం డంతోపట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు వారు గుర్తించారు. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రభుత్వానికి నివేదించడంతో పాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నాలుగు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నట్లు జిల్లా ప్రోగ్రామింగ్‌ అధికారి డాక్టర్‌ అంజన తెలిపారు. తమ పరిధిలో కేటాయించిన ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

Updated Date - 2022-09-25T06:28:18+05:30 IST