కల్యాణ మండపం పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-20T06:09:08+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్‌లో తిరుమల వంశం పేరిట రూ.40 లక్షల సొంత నిధులతో నిర్మిస్తున్న కల్యాణ మండపాన్ని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారీ మంగళవారం పరిశీలించారు.

కల్యాణ మండపం పనుల పరిశీలన
పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 19 : ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్‌లో తిరుమల వంశం పేరిట రూ.40 లక్షల సొంత నిధులతో నిర్మిస్తున్న   కల్యాణ మండపాన్ని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారీ మంగళవారం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్‌ తనకు జన్మనిచ్చిన గ్రామమని, ఊరి  రుణం తీర్చుకోవడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు.  గ్రామస్థుల కోరిక  మేరకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు తరగతి గదులు, గ్రంథాలయ నిర్మాణంతోపాటు, హన్‌మాన్‌ దేవాలయం పునర్నిర్మాణం కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అంతకుముందు కేవీ రమణాచారీకి ఆలయ అర్చకులు, వేణుగోపాలస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.   గ్రామ సర్పంచ్‌ నిమ్మల లక్ష్మి  రమణాచారిని సన్మానించారు.  కార్యక్రమంలో వేములవాడ దేవాస్థానం డీఈ రామేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ జయంత్‌, ర పొబిషన్‌ ఎస్సై సంద్య, ఆలయ కమిటీ చైర్మన్‌ నర్సయ్య తదితరులు ఉన్నారు.   

ప్రభుత్వ సలహాదారుకు సన్మానం 

  సాహితీవేత్త, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ని  ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో మంగళవారం  తెలంగాణ వివేక రచయిత సంఘం అధ్యక్షుడు వాసరవేణి పర్శరాములు, కార్యదర్శి దుంపెన రమేష్‌ సన్మానించారు.  కార్యక్రమంలో  సర్పంచ్‌ నిమ్మ లక్ష్మీనారాయణరెడ్డి, ఉప సర్పంచ్‌ మహేందర్‌, ఎంపీటీసీ అపేరా సుల్తానా బేగం, దేవాలయ కమిటీ చైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:09:08+05:30 IST