అర్హులందరూ టీకా వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-09-17T05:22:41+05:30 IST

పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సూచించారు.

అర్హులందరూ టీకా వేయించుకోవాలి
మల్దకల్‌లో వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాంపై అధికారులకు ఆదేశాలిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- మల్దకల్‌, అయిజ మండలాల్లో పర్యటన

- వ్యాక్సినేషన్‌ కేంద్రాల పరిశీలన

మల్దకల్‌/ అయిజ/ అయిజటౌన్‌/ గద్వాల క్రైం, సెప్టెంబరు 16 : పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సూచించారు. వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మల్దకల్‌ మండల కేంద్రంలో గురువారం ప్రారంభమైన వాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. పెద్దలతో పాటు యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతివనంను అందంగా తీర్చిదిద్దాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, సందర్శకులకు ప్రత్యేక సమయాన్ని సూచించాలని సర్పంచ్‌ యాకోబు ను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ముసాయిదాబేగం, మల్దకల్‌ ఎంపీడీవో కృష్ణయ్య, వైద్యాధికారి యమున, పంచాయతీ కార్యదర్ళి మాబూబీ తదిత రులు పాల్గొన్నారు. 


వారంలోగా వంద శాతం వ్యాక్సినేషన్‌

వారంలోగా వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. అయిజ మండలంలోని ఉప్పల గ్రామం లో గురువారం ఏర్పాటు చేసిన కొవిడ్‌ టీకా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అంతకు ముందు పట్టణంలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని పరిశీలించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కోటి 50 లక్షల రూపాయలతో వీటిని నిర్మిస్తున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌, ఏఈ గోపాల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. నాలా స్థలాన్ని, వాటి చుట్టూ జరిగిన నిర్మాణాలను, వారి కలెక్టర్‌ పేర్లను అడిగి తెలుసుకున్నారు. నాలా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గ్రంథాలయాన్ని సందర్శించి, పాఠకులతో మాట్లాడారు. నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, కౌన్సిలర్‌ శ్రీరాములు, తహసీల్దార్‌ యాదగిరి, ఆర్‌ఐ లక్ష్మీరెడ్డి, ఎంపీడీవో సాయిప్రకాష్‌, ఎంపీవో నర్సింహరెడ్డి, నాయకులు ఎక్లాస్‌పూర్‌ నర్సింహరెడ్డి, వేణు, పెద్దయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు. 


పరిశ్రమలకు సత్వరమే అనుమతి

జిల్లాలో సెప్టెంబరు 16, 2021 వరకు పరిశ్రమలు స్థాపించిన వారికి  టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సత్వరమే అనుమతిస్తున్నట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న అనుమతుల వివరాలను జిల్లా పరిశ్రమలశాఖ అధికారి యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటివరకు 215 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో అధికారులు పురుషోత్తం రెడ్డి, తరుపతిరావు, భాస్కర్‌రెడ్డి, రమేష్‌బాబు, శ్రీనివాసులు, సుధాకర్‌, పవన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-09-17T05:22:41+05:30 IST