Abn logo
Jun 16 2021 @ 23:41PM

ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ

మాట్లాడుతున్న జ్యోత్స్న

సుండుపల్లె, జూన్‌16: మండల పరిధిలోని బీజీరాచపల్లె, సుండుపల్లె, రాయవరం ప్రభుత్వ ఆసుపత్రులను బుధవారం అడిషనల్‌ డీఎంహెచ్‌వో జ్యోత్స్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందు వలన మహిళా శిశు కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ఆసుపత్రిలోని మందులను, టీకాలను రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సునీల్‌కుమార్‌నాయక్‌, రవికుమార్‌, నరే్‌షకుమార్‌, శేఖర్‌రెడ్డి, ఫార్మసిస్టులు శివకుమార్‌, నటేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.