బత్తలపల్లి, జనవరి19: మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఏడీఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు దుకాణాలను తనిఖీ చేసి యజమానులకు సూచనలు సలహాలు ఇచ్చారు. గుమ్మళ్లకుంటలోని ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీ లించి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ల్యాబ్‌ను పరిశీలించి రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించారు. ఎరువుల కొన్న ప్రతి రైతుకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. అధికధరలకు ఎరువులను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ పెన్నయ్య, ఏఈఓ వీరాంజినేయులు, సిబ్బంది పాల్గొన్నారు.