Abn logo
Sep 18 2021 @ 00:09AM

ఎరువుల దుకాణాల తనిఖీ

ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీలత

సుండుపల్లె, సెప్టెంబరు17: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీలత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగుల మందులను అమ్మాలని సూచించారు. ఎరువులను అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాకు వివరాలను బోర్డు పట్టికలో నమోదు చేయాలని తెలియజేశారు. ఎరువుల నిల్వలను కొనుగోలు అమ్మకాల బిల్లులను పరిశీలించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి వ్యవసాయశాఖ సిబ్బందితోసమావేశమై రైతులకు మంచిసేవలు అందించాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు తెలియజేయాలని, రైతు సమస్యలను పరిష్కరించాలని  సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో మురళీధర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.