Abn logo
Oct 25 2021 @ 23:17PM

అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

అంగన్వాడీ చిన్నారులతో కలిసి భోజనం చేస్తున్న పీడీ పద్మజ

దువ్వూరు, అక్టోబరు 25: మండల కేంద్రమైన దువ్వూరులోని 1, 5, 7 అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్‌ పీడీ పద్మజ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం పాలు, గుడ్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని పీడీ సూచించారు. అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభు త్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు అందజేయాలన్నారు. అనంతరం క్రిస్టియన్‌ క్వార్టర్స్‌లోని 1వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతోపాటు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో నిర్మలాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.