ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ రంజన్ రతన్‌కుమార్
అలంపూర్ చౌరస్తా, జూలై 2: ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సడక్‌బంద్ నేపథ్యంలో ఎస్పీ రంజన్ రతన్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఇమానియోల్, అలంపూర్ సీఐ సూర్యనాయక్‌లు శనివారం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ నుంచి వచ్చే పలు వాహనాలను వారు తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై ఎలాంటి ఆందోళనలు, ధర్నాలకు అనుమతి లేదని ఎస్పీ పేర్కొన్నారు. ఉండవల్లి ఎస్సై బాలరాజు, అలంపూర్ ఎస్సై శ్రీహరి ఉన్నారు.