సడలని మహమ్మారి పట్టుపట్టు

ABN , First Publish Date - 2020-09-17T10:29:23+05:30 IST

జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 50 వేలు దాటింది. బుధవారం వెల్లడించిన బులెటిన్‌లో జిల్లాలో కొత్తగా 725 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు బాధితులు మరణిం చారు.

సడలని మహమ్మారి పట్టుపట్టు

 50 వేలు దాటిన కరోనా బాధితులు 

కొత్తగా 725 మందికి పాజిటివ్‌

మరో ఐదుగురు మృతి

425కి పెరిగిన మృతుల సంఖ్య 

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 16 :  జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 50 వేలు దాటింది. బుధవారం వెల్లడించిన బులెటిన్‌లో జిల్లాలో కొత్తగా 725 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు బాధితులు మరణిం చారు. దీంతో ఇప్పటి వరకూ నమోదైన బాధితుల సంఖ్య 50813కి చేరింది. వీరిలో 46818 మంది వైరస్‌ నుంచి కోలుకోగా మిగతా వారు వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు. మొత్తం మృతుల సంఖ్య 425కి పెరిగింది. కాగా మహమ్మారి నుంచి కోలుకున్న 574 మందిని బుధవారం డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.


జిల్లా కేంద్రంలోనే 229 పాజిటివ్‌ కేసులు 

బుధవారం వెల్లడించిన హెల్త్‌బులెటిన్‌లో జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా 229 కేసులు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు. హిందూపురం 89, గుంతకల్లు 49, కదిరి 31, పుట్టపర్తి 26, తాడిపత్రి 22, ధర్మవరం 19, రాయదుర్గం 19, గుడిబండ 18, పరిగి 16, ఉరవకొండ 16, కొత్తచెరువు 14, ముదిగుబ్బ 12, నల్లచెరువు 11, గార్లదిన్నె 10, గోరంట్ల 10, కళ్యాణదుర్గం 10, కనగానపల్లి 9, కంబదూరు 8, నార్పల 8, ఆగళి 7, ఓడీసీ 7, గుత్తి 6, లేపాక్షి 6, తనకల్లు 5, విడపనకల్లు 5, అమరాపురం 4, సీకేపల్లి 4, ఎన్‌పీకుంట 4, పెనుకొండ 4, శెట్టూరు 4, వజ్రకరూరు 4, గార్లదిన్నె 3, గుమ్మఘట్ట 3, కణేకల్లు 3, పామిడి 3,. శింగనమల 3, తలుపుల 3, ఆత్మకూరు, బత్తలపల్లి, బొమ్మనహాళ్‌, బుక్కపట్నం, కూడేరు, మడకశిర మండలాల్లో రెండు, బెళుగుప్ప, బుక్కరాయ సముద్రం, చిలమత్తూరు, పెద్దపప్పూరు, రామగిరి, రాప్తా డు మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు.  


నేడు కరోనా నమూనాలు సేకరించే ప్రాంతాలివే 

జిల్లాలో గురువారం కళ్యాణదుర్గం అర్బన్‌, కళ్యాణ దుర్గం రూరల్‌, గాండ్లపెంట, కృష్ణాపురం, పరిగి, బేళూరు, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, ఎన్‌పీ కుంట, బోయపేట, రొద్దం, శెట్టూరు, ధర్మవరం, దర్శినమల, తాడిపత్రి, జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌, ప్రభు త్వ బాలుర జూనియర్‌ కళాశాల, పాతూరు ఆస్పత్రి ప్రాం తాల్లో కొవిడ్‌ నమూనాలు సేకరిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-17T10:29:23+05:30 IST