కేజీబీవీ పాఠశాల అన్నంలో పురుగులు

ABN , First Publish Date - 2022-07-05T07:36:51+05:30 IST

భైంసాలోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలో అన్నంలో పురుగులు వస్తున్నాయి.

కేజీబీవీ పాఠశాల అన్నంలో పురుగులు
అస్వస్థతకు గురైన కూతురిని ఆసుపత్రికి తీసుకువెళుతున్న తండ్రి

భైంసా, జూలై 4 :  భైంసాలోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయంలో  అన్నంలో పురుగులు వస్తున్నాయి.  నిర్వాహణ అధికారుల బాధ్యతారాహిత్యం, పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం తోడవ్వడం మూలంగా ఐదు రోజులుగా  పాఠశాల లోని విద్యార్థులు పురుగులతో కూడిన అన్నం తింటున్నారు.  నిర్వహణ అధికారు లకు, సిబ్బందికి అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పిన, చూపించిన పట్టిం చుకునే వారే కరువయ్యారు. . దీంతో కొంత మంది విద్యార్థులు పురుగుల అన్నం తినలేక పస్తులుండాల్సి వచ్చింది. రెండు, మూడు రోజులుగా పస్తులున్న పలు వురు విద్యార్థులు సోమవారం నీరసంతో  పడిపోయారు.  అంతేకాకుండా పురు గులతో కూడిన అన్నం తిన్న పులువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోని అస్వస్థత చెందారు.  ఐదు రోజులుగా పురుగులతో కూడిన అన్నం వడ్డి స్తున్న విషయం పోక్కనీయకుండా నిర్వాహణాధికారులు, పర్యవేక్షణాఽధికారులు గొప్యత పాటిస్తూ వచ్చారు. విద్యార్థులు నీరసంతో పడిపోవడం, వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో సమస్య వెలుగు చూసింది. సంబంధిత సమస్య తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల వచ్చి నిర్వా హణాధికారుల తీరును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. పాఠశాల అవరణలో ఆందోళనకు దిగారు. ప లువురు తల్లితండ్రులు నీరసంతో అస్వస్థత చెందిన, వాంతులు, విరే చనాలు చేసుకుంటున్న  తమ పిల్లలను స్వయంగా ఆటోల ద్వారా ఆసుపత్రికి తరలించుకపోయారు. సంబంధిత సమాచారం అందుకున్న మరికొంత మంది విద్యార్థులు హు టాహుటిన పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకవెళ్లిపోయారు. 

ఫ నీరసంతో పడిపోయిన విద్యార్థులు

 రెండు మూడు రోజులుగా పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్న పది మందికి పైగా విద్యార్థులు నీరసంతో తరగతి గదుల్లో, పాఠశాల అవరణలో పడి పోయారు. పాఠశాల నిర్వాహణాఽఽధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది నీర సంతో విద్యార్థులు పడిపోవడంతో స్పందించారు. కొంతమంది విద్యార్థులకు మంచినీరు అందించడం, ఓఅర్‌ఎస్‌ ద్రావణాన్ని అందించే చర్యలు చేపట్టారు. అప్పటికే కొంత మంది విద్యార్థులు నీరసంతో తోటి విద్యార్థులు పడిపోయిన విషయాన్ని ఫోన్‌ ద్వారా తమ తమ తల్లితండ్రులకు అందించారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు తరలివచ్చి ఆందోళనలు చేపట్టారు. 

 ఫ   బియ్యంతోనే సమస్య  : రవీందర్‌రెడ్డి, డీఈవో

 ఎంఎల్‌ఎస్‌ కేంద్రం నుంచి సరఫరా బియ్యంతో అధికంగా పురుగులు ఉండటం మూలంగా సమస్య ఏర్పడినట్లుగా డీఈవో రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం భైంసా ఎంఈవో సుభాష్‌తో కలిసి కేజీబీవీ పాఠశాలలో విచారణ జరిపారు. మెస్‌ నిర్వాహకులు బియ్యంలోని పురుగులను పూర్తి స్థాయిలో  ఏరివేయకుండా వండటంతోనే  అన్నంలో పురుగులు వచ్చాయన్నారు. జిల్లా కలెక్టర్‌కు సంబంధిత సమస్యను వివరించగా స్పందించి బియ్యం మార్చి వేసే విధంగా ఆదేశాలిచ్చారని వెల్లడించారు. ఎంఎల్‌ఎస్‌ కేంద్రం నుంచి తాజా గా సరఫరా అయిన బియ్యాన్ని కేజీబీవీ పాఠశాలకు పంపించడం జరిగింద న్నారు. మరోమారు ఎలాంటి సమస్య ఏర్పడకుండా ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయినప్పటికి పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

Updated Date - 2022-07-05T07:36:51+05:30 IST