గీతం విశ్వవిద్యాలయంలో ఇన్సా వర్క్‌షాప్‌

ABN , First Publish Date - 2022-08-17T05:53:12+05:30 IST

బయోటెక్నాలజీ రంగంలో వ్యాక్సిన్ల తయా రీ, ఆరోగ్య సంబంధ ఉత్పత్తుల పరిశోధనలపై మంగవారం గీతం వర్సిటీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ (ఇన్సా) ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమయింది.

గీతం విశ్వవిద్యాలయంలో ఇన్సా వర్క్‌షాప్‌
వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ శరత్‌ చంద్రబాబు

ఎండాడ/ సాగర్‌నగర్‌, ఆగస్టు 16: బయోటెక్నాలజీ రంగంలో వ్యాక్సిన్ల తయా రీ, ఆరోగ్య సంబంధ ఉత్పత్తుల పరిశోధనలపై మంగవారం గీతం వర్సిటీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ (ఇన్సా) ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్‌షాప్‌  ప్రారంభమయింది. రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ జినామిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌జెనిసిస్‌ అంశంపై  దీనిని నిర్వహిస్తున్నారు. స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.శరత్‌చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభ కార్యక్రమానికి సైన్స్‌ కోర్సుల డీన్‌  ప్రొఫెసర్‌ ఎం.బాలాకుమార్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌ అండ్‌ సొసైటీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుబీర్‌ ఎస్‌.మజందార్‌ హాజరయ్యారు. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయ్నాస్టిక్స్‌ (హైదరాబాద్‌) నిపుణుడు డాక్టర్‌ సుఖదీప్‌ చటర్జీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ కృష్ణవేణి మిశ్రా ప్రసంగించారు. బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బి.వీరేంద్రకుమార్‌, కో-ఆర్గినేటర్‌ డాక్టర్‌ జీవీశిరీష, సీనియర్‌ ప్రొఫెసర్స్‌ ఎం.అనిత, డాక్టర్‌ పి.కిరణ్మయి, నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:53:12+05:30 IST