భారత నౌకాదళంలో చేరిన ‘INS Vela’ జలాంతర్గామి

ABN , First Publish Date - 2021-11-25T16:56:59+05:30 IST

దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో గురువారం చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించింది...

భారత నౌకాదళంలో చేరిన ‘INS Vela’ జలాంతర్గామి

ముంబై: దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో గురువారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది.ఈ జలాంతర్గామిని ముంబయికి చెందిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది.గతంలో తయారు చేసిన కల్వరి, ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు.ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31వతేదీన ప్రారంభించిన తర్వాత 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవలు అందించింది.ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి అత్యంత శక్తివంతమైనది. ఈ జలాంతర్గామి పోరాట సామర్ధ్యం గణనీయమని నావికాదళ అధికారులు చెప్పారు. ఇండియన్ నేవీ యొక్క స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక పలు క్షిపణులు, రాకెట్లతో నిండి ఉంది. 


Updated Date - 2021-11-25T16:56:59+05:30 IST