కువైట్, ఖతార్‌ల నుంచి వైద్యసాయం మోసుకొచ్చిన ఐఎన్ఎస్ శార్దూల్

ABN , First Publish Date - 2021-06-25T03:17:25+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌కు కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి వైద్యసాయం వచ్చింది.

కువైట్, ఖతార్‌ల నుంచి వైద్యసాయం మోసుకొచ్చిన ఐఎన్ఎస్ శార్దూల్

ముంబై: కరోనా సెకండ్ వేవ్ ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌కు కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి వైద్యసాయం వచ్చింది. ఈ సాయాన్ని ఇండియన్ నేవల షిప్ (ఐఎన్ఎస్) శార్దూల్ మోసుకొని ముంబై పోర్టుకు చేరింది. ఈ సాయంలో నిండుగా ఉన్న 7,640 ఆక్సిజన్ సిలిండర్లు, 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, రెండు ఐఎస్ఓ కంటైనర్లు ఉన్నాయి. మే నెలలో కూడా కువైట్ నుంచి ఒక ఓడ వైద్యసాయం తీసుకొని ముంబై చేరింది. ఆ ఓడలో మూడు సెమీ ట్రైలర్ల నిండుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉంది. వీటిలో ఒక్కోదానిలో 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉంది. వీటితోపాటు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఈ ఓడ తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి కువైట్ నుంచి మనకు వైద్య సాయం అందింది.

Updated Date - 2021-06-25T03:17:25+05:30 IST