‘ఇన్‌డ్రైవర్’ కార్యకలాపాలు పున:ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-29T00:52:13+05:30 IST

ప్రముఖ క్యాబ్ రవాణా సంస్థ ఇన్‌డ్రైవర్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ రోజు నుంచి వినియోగదారులు...

‘ఇన్‌డ్రైవర్’ కార్యకలాపాలు పున:ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ రవాణా సంస్థ ఇన్‌డ్రైవర్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ రోజు నుంచి వినియోగదారులు తమ క్యాబ్‌లను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా క్యాబ్ ఓనర్లు కూడా తిరిగి పని ప్రారంభించవచ్చిన పేర్కొంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు తమ కార్యకలాపాలను నిలిపివేశామని, అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పలు రకాల సడలింపులు ప్రకటించడంతో సేవలను పున:ప్రారంభించామని ఇన్‌డ్రైవర్ యాజమాన్యం తెలిపింది. అయితే కరోనా నుంచి రక్షణ పొందడంతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా డ్రైవర్లు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని ఇన్‌డ్రైవర్ పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ పవిత్ నంద సూచించారు.


క్యాబ్‌లోకి ఎక్కేముందు, దిగిన తరువాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కారు వెనుక సీట్లో మాత్రమే ప్రయాణీకులు కూర్చోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్యాబ్‌లో డ్రైవర్ కాకుండా మరొకరు మాత్రమే కూర్చోవాలని, అది కూడా వెనుక సీట్లో మాత్రమే కూర్చోవాలని సూచించారు. ప్రయాణికులు, డ్రైవర్ల భద్రతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సురక్షితమైన,  సుఖవంతమైన ప్రయాణమే తమ ధ్యేయమని చెప్పారు.

Updated Date - 2020-05-29T00:52:13+05:30 IST