Abn logo
Jul 3 2020 @ 04:58AM

‘రాజకీయ కారణాలతో పింఛన్‌ కట్‌’పై విచారణ

త్వరలో డబ్బులు ఇస్తామని ఏపీడీ హామీ 


 కొండపి, జూలై 2: పెదకండ్లగుంట గ్రామానికి చెందిన అర్హులైన పింఛన్‌దారులు ఆరుగురికి పింఛన్‌ డబ్బులు గ్రామ వలంటీర్లు ఇవ్వకుండా రాజకీయ కార ణాలతో ఇబ్బందులు పెడుతున్న విషయంపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాజకీయ కారణాలతో పింఛన్‌ కట్‌ కథనంపై అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ ఏపీడీ వరప్రసాద్‌ శుక్రవారం పెదకండ్లగుంట గ్రామం వెళ్లి గ్రామ సచివాలయంలో విచారణ చేశారు.


పింఛన్‌దారులను పిలిచి వారితో మాట్లాడారు. గ్రామ పం చాయతీ కార్యదర్శి, గ్రామ వలంటీర్లతో ఏపీడీ మాట్లాడారు. పింఛన్‌డబ్బులు ఎందుకు ఇవ్వలేదని వారిని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి ఈ విషయంలో స రిగా స్పందించకపోవడంపై వరప్రసాద్‌ మందలించారు. ఇటువంటి పనులు చేయవద్దని గ్రామ వలంటీర్లను హెచ్చరించారు. త్వరలో పింఛన్‌దారులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని ఏపీడీ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement