పంచాయతీ అక్రమాలపై విచారణ షురూ...!

ABN , First Publish Date - 2021-11-28T03:52:00+05:30 IST

మండలంలోని ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఈనెల 25న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘అక్రమాలపై విచారణ ఎప్పుడో..?’ కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు స్పం దించారు.

పంచాయతీ అక్రమాలపై విచారణ షురూ...!
పంచాయతీ కార్యాలయంలో విచారణ జరుపుతున్న డీఎల్‌పీవో ప్రభాకర్‌రావు

దండేపల్లి, నవంబరు 27: మండలంలోని ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఈనెల 25న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘అక్రమాలపై విచారణ ఎప్పుడో..?’ కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు స్పం దించారు. పంచాయతీ పరిధిలో వారసంత నిధులు పక్కదారి పట్టడంతోపాటు ఇక్కడి ఏజెన్సీ భూము ల్లో ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేయడం, వాటిలో పంచాయతీ నిధులతో రోడ్లు వేయడంపై ఆంధ్ర జ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో శనివారం డివి జనల్‌ పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు గ్రామ పం చాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం మండల పంచాయతీ అధికారి మేఘ మాలతో కలిసి ప్రైవేటు వెంచర్లలో నిర్మించిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మా ట్లాడుతూ విచారణ పూర్తయిన తరువాత నివేది కను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించ నున్నట్లు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-11-28T03:52:00+05:30 IST