Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతు ఆత్మహత్యపై విచారణ

తనకల్లు,  అక్టోబరు 14: రైతు ఆత్మహత్యపై అధికారులు గ్రామా నికి వెళ్లి విచారణ చేపట్టారు. మం డలంలోని వడ్డిపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం మహ దేవ (52) అనే రైతు అప్పుల బాధ తాళ లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కదిరి ఆర్డీఓ వెంకట రెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్‌, ఏడీఏ సత్య నారాయణ గురువారం గ్రామానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు... అప్పులు ఎన్ని ఉన్నాయి.. వ్యవసాయ వివరాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ, ఆర్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. Advertisement
Advertisement