పీఆర్సీ జీవోలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-02-01T22:01:46+05:30 IST

పీఆర్సీ జీవోలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల్లో రికవరీ చేయొద్దని

పీఆర్సీ జీవోలపై హైకోర్టులో విచారణ

అమరావతి: పీఆర్సీ జీవోలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల్లో రికవరీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల్లో రికవరీ సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. జీతాల్లో రికవరీ, ఎరియర్స్‌ వసూలు వంటి అంశాలపై హైకోర్టు దృష్టికి పిటిషనర్‌ న్యాయవాది రవితేజ తీసుకువచ్చారు. రికవరీ చేయడం లేదని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. సమగ్ర కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


ఉద్యోగులు హైకోర్టుకు వచ్చి మరోవైపు సమ్మెకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి అడ్వకేట్‌ జనరల్‌ తీసుకువచ్చారు. సమ్మెకు వెళ్తున్నారా అని పిటిషనర్‌ తరపు న్యాయవాది రవితేజను ధర్మాసనం ప్రశ్నించింది. సమ్మెతో పిటిషనర్‌కు సంబంధం లేదని పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. వ్యాజ్యం కోర్టు ముందు విచారణకు వచ్చిన తరువాత సమ్మెకు వెళ్లడం మంచిది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాజ్యం విచారణలో ఉందని హైకోర్టు పేర్కొంది. సమ్మె వలన కోర్టులపై పరోక్షంగా ఒత్తిడి పెరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. 


Updated Date - 2022-02-01T22:01:46+05:30 IST