Abn logo
Sep 15 2021 @ 19:39PM

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడో దశ కరోనాను ఎదుర్కొనే ప్రణాళికను ప్రభుత్వం సమర్పించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బడులు ప్రారంభమైనందున పిల్లల్లో కరోనా సోకకుండా మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేతులెత్తయకుండా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని హైకోర్టు ఆదేశించింది.

 జులై 15న నిపుణుల కమిటీ సమావేశమై పలు సిఫార్సులను చేసిందని ఏజీ తెలిపారు. నిపుణుల కమిటీల సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 22 వరకు మూడో దశ కరోనా ప్రణాళికను ప్రభుత్వం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనాను ఎదుర్కొనే సన్నద్ధతపై ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం స్పందించక పోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఇవి కూడా చదవండిImage Caption