ప్రారంభమైన ఇనార్బిట్ అన్‌బాక్సింగ్ హ్యాపీనెస్ సేల్.. 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-07-02T01:08:51+05:30 IST

నగర వాసులకు తనివితీరా షాపింగ్ చేసే సమయం ఆసన్నమైంది. ఇనార్బిట్ మాల్ తన అన్‌బాక్సింగ్ హ్యాపీనెస్

ప్రారంభమైన ఇనార్బిట్ అన్‌బాక్సింగ్ హ్యాపీనెస్ సేల్.. 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్

హైదరాబాద్: నగర వాసులకు తనివితీరా షాపింగ్ చేసే సమయం ఆసన్నమైంది. ఇనార్బిట్ మాల్ తన అన్‌బాక్సింగ్ హ్యాపీనెస్ సేల్‌ను ప్రారంభించింది. జులై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంది. 50కిపైగా బ్రాండ్లపై ఫ్లాట్‌గా 50శాతం రాయితీ అయిందిస్తున్నారు. అంతేకాదు, డీల్స్, డిస్కౌంట్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. సేల్ జరిగే ఈ మూడు రోజులు రాత్రి 10 గంటల వరకు మాల్ తెరిచి ఉంటుంది. ఫ్లాట్ 50 శాతం తగ్గింపు అమ్మకాలు వారాంతంలో మాత్రమే అందుబాటులో ఉన్నా, అన్‌‌బాక్సింగ్‌ హ్యాపీనెస్‌ సేల్‌ మాత్రం జూలై 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.


50 శాతం రాయితీ లభించే బ్రాండ్లలో  ప్రీమియం అప్పారెల్‌, బ్యాగ్స్‌, ఫిట్‌నెస్‌, ఫుట్‌వేర్‌‌తోపాటు యాక్సెసరీ బ్రాండ్లు అయిన హెచ్‌ అండ్‌ ఎం, ఫరెవర్‌ న్యూ, స్కెచర్స్‌, పుమా, చార్లెస్‌ అండ్‌ కీత్‌, బాత్‌, బాడీ వర్క్‌, లాకొస్టె, ఆల్డో వంటివి ఉన్నాయి. షాపర్స్‌ ఇప్పుడు ఫ్లాట్‌ 50 శాతం తగ్గింపును ఎంపిక చేసిన వస్తువులపై లైఫ్‌స్టైల్‌, షాపర్స్‌ స్టాప్‌, పాంటాలూన్స్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌, మ్యాక్స్‌ వద్ద  అందిస్తున్నారు. వాచ్‌ ప్రేమికులు రమేష్‌ వాచ్‌ కో, కమల్‌ వాచ్‌ కో, ఫాసిల్‌ వద్ద ఆకర్షణీయమైన రాయితీలను పొందవచ్చు.


వినియోగదారులు మాల్ ప్రవేశ ద్వారం వద్దనున్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే కొన్ని పాయింట్లు బహుమతిగా లభిస్తాయి. షాపింగ్ సమయంలో వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మూడు రోజులు హాయిగా షాపింగ్ చేయండి. షాపర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో బూత్ వద్ద ఫొటో తీసుకోవడం మర్చిపోవద్దు. 

Updated Date - 2022-07-02T01:08:51+05:30 IST