హైదరాబాద్ వాసులను అమితంగా ఆకట్టుకుంటున్న కిడ్జ్‌టోపియా!

ABN , First Publish Date - 2022-05-29T00:08:47+05:30 IST

వేసవి సెలవుల వినోదానికి నగరంలోని ఇనార్బిట్ మాల్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందులోని కిడ్జ్‌టోపియా

హైదరాబాద్ వాసులను అమితంగా ఆకట్టుకుంటున్న కిడ్జ్‌టోపియా!

హైదరాబాద్: వేసవి సెలవుల వినోదానికి నగరంలోని ఇనార్బిట్ మాల్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందులోని కిడ్జ్‌టోపియా చిన్నారుల కోసం సృజనాత్మక కార్యక్రమాలు, ఆహ్లాదకరమైన వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వారాంతాల్లో వినోద కార్యక్రమాలతో కనువిందు చేస్తోంది. జూన్ 5వ తేదీ వరకు ఈ కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది.


సైన్స్ ల్యాబ్‌లో వినోదాత్మక ప్రయోగాలు చేయడం లేదంటే, అక్కడి వలంటీర్ల మార్గనిర్దేశకత్వంలో చెఫ్‌గా మారి వంటలు కూడా చేయొచ్చు. వీటితో పాటుగా లెగో సిటీతో  సంపూర్ణ వినోదాన్ని కూడా పొందొచ్చు. చిన్నారులకు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులందరికీ ఇది చక్కని వినోదాన్ని పంచుతుంది. అలాగే, ఈ నెల 28,29 తేదీలలో జగ్లర్‌, ఎంటర్‌టైనర్‌ శాండీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జూన్‌ 4–5 తేదీలలో  మెజీషియన్‌ యోగేష్‌ అత్యద్భుతమైన మ్యాజిక్‌ ట్రిక్స్‌తో అలరించనున్నారు.


వినూత్న అనుభవాలను అందించే ఈ మాల్‌ షాపింగ్‌ కోసం  అత్యుత్తమ కేంద్రంగా నిలువడమే కాకుండా డైనింగ్‌, వినోదం కోసం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. కిడ్జ్‌టోపియ కోసం చిన్నారుల పేర్లను Instagram.com/inorbitcyberabadలో నమోదు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం !

Updated Date - 2022-05-29T00:08:47+05:30 IST