Inorbit Mall: స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని రగిలిస్తున్న ఇనార్బిట్ మాల్

ABN , First Publish Date - 2022-08-09T22:15:04+05:30 IST

ఈ ఏడాది భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనది. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని

Inorbit Mall: స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని రగిలిస్తున్న ఇనార్బిట్ మాల్

హైదరాబాద్: ఈ ఏడాది భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనది. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ (Inorbit Mall)ను స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని రగిలించేలా అలంకరించారు. ఈ నెల 6 నుంచే ఇక్కడ స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభమయ్యాయి. మాల్ ముందుభాగంలో త్రివర్ణ పతాక రంగుల్లో కాంతులు వెదజల్లే లైట్లను అలంకరించారు. అలాగే, అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఫ్రీడమ్ ట్రీని ఏర్పాటు చేశారు.


సందర్శకులను ఇది ఎంతగానో ఆకర్షిస్తోంది. స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలిస్తోంది. మాల్‌ను సందర్శించిన వారు దేశం గురించి తమ భావాలను, ఆకాంక్షలను చెట్టువద్ద రాస్తున్నారు. అందుకుగాను వారికి ఓ జాతీయ జెండాను నిర్వాహకులు అందిస్తున్నారు. అలాగే, ఈ ఫ్రీడమ్ ట్రీ వద్ద దిగిన ఫొటోను @inorbitcyberabadకు ట్యాగ్ చేయడం ద్వారా మాల్ నుంచి ఓచర్లు కూడా పొందొచ్చు. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. మరెందుకాలస్యం.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా సందర్శించి మధురానుభూతులను సొంతం చేసుకోండి. 

Updated Date - 2022-08-09T22:15:04+05:30 IST