పెట్రో ధరలపై వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-06-18T05:11:30+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపాయి. ద్విచక్ర వాహనాలను ఇక వినియోగించలేమని చెబుతూ వాటికి పిండ ప్రదానం చేశాయి.

పెట్రో ధరలపై వినూత్న నిరసన
బైక్‌కు పిండప్రదానం చేస్తున్న సీపీఐ నాయకులు

బైకుకు పిండ ప్రదానం చేసిన సీపీఐ శ్రేణులు

విజయనగరం దాసన్నపేట, జూన్‌ 17: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపాయి. ద్విచక్ర వాహనాలను ఇక వినియోగించలేమని చెబుతూ వాటికి పిండ ప్రదానం చేశాయి. అంబేడ్కర్‌ జంక్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పెట్రో ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం తగదన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోయినా, పెట్రోలు, డీజిల్‌ ధరలు మాత్రం పెంచుకుంటూ వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


Updated Date - 2021-06-18T05:11:30+05:30 IST