వినూత్నంగా పంటల సర్వే

ABN , First Publish Date - 2021-08-03T06:41:57+05:30 IST

ఈ ఏడాది వానాకాలం సాగు చేసిన పంటల వివరాలను వినూత్నంగా నమోదు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు రంగం సిద్ధం చేశారు.

వినూత్నంగా పంటల సర్వే

సర్వేనంబర్‌ ఆధారంగా నమోదు 

అధ్యయనం కోసం ఏపీకి వెళ్లి వచ్చిన వ్యవసాయాధికారులు  

ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపు

సూర్యాపేట సిటీ, ఆగస్టు 2: ఈ ఏడాది వానాకాలం సాగు చేసిన పంటల వివరాలను వినూత్నంగా నమోదు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు రంగం సిద్ధం చేశారు. భూ సర్వే నంబర్ల ఆధారంగా సా గు వివరాలు నమోదు చేయనున్నారు. అందుకు రెండు నెలల క్రితం జిల్లా నుంచి ఐదుగురు వ్యవసాయాధికారులు ఏపీ రాష్ట్రంలో అధ్యయ నం చేసివచ్చారు. స్థానికంగా దీని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో అనుసరిస్తున్న క్రాప్‌ బుకింగ్‌ విధానంపై వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు నివేదిక సైతం అందజేశా రు. ఏవిధానం అమలుచేయాలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. సర్వే నంబర్‌ ఆధారంగా పంటల వివరాలు నమోదుచే స్తే కచ్చితమైన విస్తీర్ణంతోపాటు, దిగుబడి అంచనా సులువు అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అదేవిధంగా దిగుబడుల విక్రయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉందని అంటున్నారు.

వచ్చేనెల 30వరకు గడువు

పంటల నమోదును సెప్టెంబరు 30వ తేదీలోగా వ్యవసాయాధికారు లు పూర్తిచేయాల్సి ఉంది. సర్వే నంబర్‌ ఆధారంగా వివరాలు నమోదుచేయాల్సి వస్తే ఈ గడువు సరిపోదని వ్యవసాయ విస్తరణాధికారులు అంటున్నారు. ఒక్కో విస్తరణాధికారుల పరిధి 5వేల ఎకరాల నుంచి 10వేల ఎకరాల వరకు ఉంది. గతంలో పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగా పంటల నమోదు చేసేవారు. ఒక రైతుకు పలు ప్రాంతాల్లో భూ మి ఉంటే, ఒక చోట సాగు చేసిన పంటల వివరాలనే ఏఈవోలు నమో దు చేసేవారు. కొత్త విధానంలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నంబర్‌ ఆధారంగా సాగు వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. దీంతో రోజుకు ఒక గ్రామంలో 10మంది రైతుల వివరాలే నమోదు చేయగలుగుతామని ఏఈవోలు అంటున్నారు. ఒక రైతు సర్వేనంబర్లలో ని పూర్తి వివరాలు నమోదు చేశాక మరో రైతు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమ యం పడుతుందని ఏఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట లెక్కలు పక్కాగా తేల్చేందుకు

ఏటా జిల్లాలో సాగయ్యే పంటల వివరాలు సాగుచేస్తున్నారు. సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలు పక్కాగా తెలుసుకునేందుకు నూతన విధా నం ఉపయోగపడుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు వరి 12,418ఎకరాలు, కంది 3,315, పెసర 4,428, వేరుశనగ 399, పత్తి 58,064 ఎకరాల్లో సా గయ్యాయి. ఆగస్టు చివరి మాసం వరకు వరి నాట్లు వేసుకునే అవకాశం ఉంది. దీంతో వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది : డి.రామారావు నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి

క్రాప్‌ బుకింగ్‌ విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఇటీవల ఏపీ రాష్ట్రానికి ఒక బృందం వెళ్లింది. పట్టాదారు పాస్‌పుస్తకం కంటే భూ సర్వేనంబర్ల ఆధారంగా పంటల నమోదుచేస్తే కలిగే ప్రయోజనాలను ఈ బృందం అధ్యయనం చేసింది. వివరాలను వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్‌కు నివేదిక రూపంలో ఇచ్చాం. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం పంటల వివరాలు నమోదు చేస్తాం.

Updated Date - 2021-08-03T06:41:57+05:30 IST