Abn logo
Sep 27 2020 @ 03:28AM

ఉన్నత విద్యాసంస్థల్లో ఆవిష్కరణ ప్రోత్సాహక కేంద్రాలు

  • విద్యార్థులను వ్యాపార వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు


అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలలు, స్వయంప్రతిపత్తి కళాశాలల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, సృజనాత్మకత, అంకుర సంస్థల ప్రోత్సాహక (ఈఐఎ్‌ససీ)కేంద్రాలు నెలకొల్పాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి  సంకల్పించింది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను రేకెత్తించడం, వ్యవస్థాపక సృజనాత్మకతను పెంపొందించడం ద్వారా వారిని వ్యాపార వ్యవస్థాపకులుగా తయారు చేయడం ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 500కి పైగా కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించినట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి  సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం... 


ప్రోత్సాహక కేంద్రాల విధులివీ..

  1. విద్యార్థులకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు 
  2. యువత, మహిళల్లో వ్యవస్థాపక వైఖరి ప్రోత్సహించడం. 
  3. ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇవ్వడం. 
  4. ఇంక్యుబేషన్‌ కేంద్రాలను స్థాపించి వ్యాపార ఆలోచనలను, నూతన టెక్నాలజీ వెంచరును రూపొందించడం తద్వారా వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేయడం. 
  5. నిధులు సమకూర్చే సంస్థల నుంచి పెట్టుబడులు పొందడానికి అవసరమైన నివేదిక తయారుచేయడంలో శిక్షణ. 
  6. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అనుసంధానం.


సలహా కమిటీ ఇలా..!

ఇక, ఉన్నత విద్యా సంస్థల్లో వైస్‌ చాన్సెలర్‌ లేదా ప్రిన్సిపల్‌ అధ్యక్షతన ఒక సలహా కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, డీఐసీ బ్యాం కులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ప్రతి కేం ద్రానికీ ఒక సీనియర్‌ ఆచార్యుడిని డైరెక్టరుగా నియమిస్తారు. ప్రతి ఈఐఎ్‌ససీ కేంద్రానికి ఉత్పాదకరంగం, సేవా, సామాజిక రం గం, ఇతర వ్యాపారాలకు సంబంధించి నిపుణుల కమిటీలు అ నుసంధానం కానున్నాయి. ఈఐఎ్‌ససీ  కేంద్రాల పనితీరు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ అధ్యక్షతన సలహా, పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
Advertisement