నీట్‌, జేఈఈ కెమిస్ర్టీ మెటీరియల్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-05-24T07:24:48+05:30 IST

కెమిస్ర్టీ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ సి.ఆంజనేయులు రూపొందించిన జేఈఈ, నీట్‌ కెమిస్ర్టీ సెకండ్‌ ఎడిషన్‌ పుస్తకాల(స్టడీ మెటీరియల్‌)ను సోమవారం నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష ఆవిష్కరించారు.

నీట్‌, జేఈఈ కెమిస్ర్టీ మెటీరియల్‌ ఆవిష్కరణ
పుస్తకాలను ఆవిష్కరిస్తున్న మేయర్‌ శిరీష తదితరులు

తిరుపతి(విద్య), మే 23: తిరుపతికి చెందిన క్యాన్‌ విద్యాసంస్థల అధినేత, కెమిస్ర్టీ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ సి.ఆంజనేయులు రూపొందించిన జేఈఈ, నీట్‌ కెమిస్ర్టీ సెకండ్‌ ఎడిషన్‌ పుస్తకాల(స్టడీ మెటీరియల్‌)ను సోమవారం నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష ఆవిష్కరించారు. స్థానిక వరదరాజనగర్‌లోని విశ్వం స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శేఖర్‌, డాక్టర్‌ విజయ్‌, డాక్టర్‌ అర్చన, స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన అనుభవంతో క్యాన్‌ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో 2018లో మొదటి ఎడిషన్‌ మెటీరియల్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందన్నారు. వారి సూచన మేరకు రీ ఎడిషన్‌ మెటీరియల్‌ అందుబాటులోకి తెచ్చానని వెల్లడించారు. జాతీయస్థాయిలో జరిగే ప్రతిష్ఠాత్మక నీట్‌, జేఈఈలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు ఈ పుస్తకాలను అధ్యయనం చేయడం వల్ల కెమిస్ర్టీలో పరిపూర్ణంగా జవాబులు రాయవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం నీట్‌, జేఈఈలకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. దీనితోపాటు ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో పూర్తిస్థాయి శిక్షణ, పదో తరగతి విద్యార్థులకు ఫౌండేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. మేయర్‌ మాట్లాడుతూ.. మద్రాస్‌ ఐఐటీలో చదివిన ఆంజనేయులు.. సుదీర్ఘ బోధనా అనుభవంతో ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుల సాధనకు ఈ సింప్లిఫైడ్‌ సిరీస్‌ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మెటీరియల్‌, శిక్షణ వంటి వివరాల కోసం 98498 17008, 99890 45979 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని ఆంజనేయులు కోరారు. 

Updated Date - 2022-05-24T07:24:48+05:30 IST