చెత్తను పారేయడానికి వచ్చి బండిలో కనిపించిన సీన్ చూసి అంతా ఆశ్చర్యం.. ఈ భార్యాభర్తల కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-30T22:15:49+05:30 IST

ఆ భార్యభర్తలు మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులు.. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం వారి పని..

చెత్తను పారేయడానికి వచ్చి బండిలో కనిపించిన సీన్ చూసి అంతా ఆశ్చర్యం.. ఈ భార్యాభర్తల కథేంటో తెలిస్తే..

ఆ భార్యభర్తలు మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులు.. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం వారి పని.. భర్త చెత్త బండి డ్రైవర్.. భార్య చెత్తను సేకరించి ఆ బండిలో వేస్తుంటుంది.. ఆరు నెలల క్రితం ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఆ బిడ్డను ఇంటి దగ్గర వదల్లేదు.. అలాగని ఆమె పనిలోకి రాకుండా ఉండలేదు.. అందుకే భార్యాభర్తలిద్దరూ ఆరు నెలల పసిబిడ్డను తీసుకుని విధులకు హాజరవుతున్నారు.. చెత్తబండిలో చీరతో ఉయ్యాల కట్టి ఎదురుగా ఫ్యాన్ కట్టారు.. చెత్తే వేసేందుకు వచ్చే వారు ఆ బిడ్డ గురించి ఆరా తీస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

ఒకే షాపులో 12 సార్లు చోరీ చేసిన దొంగోడు.. చివరకు ఎలా దొరికిపోయాడో తెలిస్తే నవ్వాపుకోలేరు..!


ఆగ్రాలోని తేధి బాగియాలో నివసిస్తున్న ధన్ సింగ్ డాంగి, అతని భార్య కళావతి మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే వాహనంలో వారి డ్యూటీ. ధన్ సింగ్ మునిసిపల్ చెత్త వాహనం నడుపుతుంటాడు. అతని భార్య హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం కళావతి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరు నెలలు ఇంటి దగ్గరే ఉండిపోయిన కళావతి ఇటీవల తిరిగి విధుల్లో జాయిన్ అయింది. ఆరు నెలల కూతురిని ఇంటి దగ్గర వదలడం కుదరదు కాబట్టి ఆ చిన్నారిని తమతో పాటు చెత్త బండిలో తీసుకొస్తున్నారు. 


చెత్త బండిలో డ్రైవర్ పక్క సీటుపై చీరతో ఊయల కట్టారు. అందులో తమ కూతురిని పడుకోబెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తల్లిదండ్రులతో పాటే ఆ చిన్నారి వాహనంలో తిరుగుతోంది. చెత్త వాహనంలో ఉన్న చిన్నారిని చూసి స్థానికులు షాకవుతున్నారు. ఆ బిడ్డ గురించి ఆరాలు తీస్తున్నారు. 

Updated Date - 2022-06-30T22:15:49+05:30 IST