యువతి ఇంటికి కండోమ్‌లు, లోదుస్తులు

ABN , First Publish Date - 2020-02-20T09:23:20+05:30 IST

గత పదిరోజుల్లో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లోని ఆ యువతి(24) ఇంటికి కండోమ్‌

యువతి ఇంటికి కండోమ్‌లు, లోదుస్తులు

  • ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆకతాయి
  • సైబర్‌ ఠాణాలో బాధితురాలి ఫిర్యాదు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): గత పదిరోజుల్లో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లోని ఆ యువతి(24) ఇంటికి కండోమ్‌ ప్యాకెట్లు, లోదుస్తుల పార్సిళ్లు వచ్చాయి. అది కూడా క్యాష్‌ ఆన్‌ డెలివరీ మీద!! వచ్చిన ప్రతిసారీ వాటిని ఆమె తిప్పి పంపింది. తాను ఆర్డర్‌ చేయకుండానే తన ఇంటికి పార్సిళ్లు వస్తుండటంతో ఆందోళనకు గురైన బాధిత యువతి మంగళవారం రాచకొండ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. యువతికి తెలిసిన వ్యక్తే ఈ పార్సిళ్లు పంపి వికృతానందం పొందుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యువతి అడ్రస్‌, ఫోన్‌నంబర్‌తో ఖాతాలు తెరిచిన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-02-20T09:23:20+05:30 IST