పురానికి అన్యాయం

ABN , First Publish Date - 2022-01-28T05:48:44+05:30 IST

‘జిల్లా కేంద్రంగా హిందూపురం పట్టణాన్ని ్ఞఆశించడం మా హక్కు. కొత్త జిల్లాల ఏర్పాటులో మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది’ అని అఖిలపక్ష సమావేశంలో పురంవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

పురానికి అన్యాయం
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి జేఏసీ నాయకులు

జిల్లా కేంద్రం ఇచ్చి తీరాలి

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

పట్టణంలో విద్యార్థి జేఏసీ నిరసన ర్యాలీ

హిందూపురం టౌన, జనవరి 27: ‘జిల్లా కేంద్రంగా హిందూపురం పట్టణాన్ని ్ఞఆశించడం మా హక్కు. కొత్త జిల్లాల ఏర్పాటులో మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది’ అని అఖిలపక్ష సమావేశంలో పురంవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని నిరసిస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు. పట్టణంలోని కనకదాస కల్యాణమండపంలో గురువారం అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. వివిధ పార్టీల ప్రతినిధులు అంబికా లక్ష్మీనారాయణ, రమే్‌షరెడ్డి, ఆకుల ఉమేష్‌, వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులు, బాలాజీ మనోహర్‌ మాట్లాడారు. హిందూపురంలో 3.5 లక్షల జనాభా ఉందని, సెలెక్షన గ్రేడ్‌ మునిసిపాలిటీగా, జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణంగా,  ప్రముఖ వాణిజ్యకేంద్రంగా పేరుగాంచిందని అన్నారు. హిందూపురానికి నలుమూలల నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అందుబాటులో ఉన్న హిందూపురాన్ని కాదని, పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో తమ ప్రాంత భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. చిన్న ఊరైన పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ప్రకటించడం తగదని అన్నారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు జమీల్‌, ఉమర్‌ఫారూక్‌, నాగరాజు, అమానుల్లా, సమీవుల్లా, మహబూబ్‌బాషా, సతీష్‌, రవితేజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద చింతపండు మార్కెట్‌, వందకుపైగా పరిశ్రమలు, విద్యాలయాలు ఉన్న హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని ఎలా జిల్లా కేంద్రంగా ప్రకటి స్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎనఎ్‌సయుఐ, టీఎనఎ్‌స ఎఫ్‌, ఎంఎ్‌సఎఫ్‌ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

- హిందూపురం జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం బైఠాయించి నిరసన తెలిపారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ కిరణ్‌, న్యాయవాది రవికుమార్‌, నాయకులు శ్రీనివాసులు, మున్న, ఆసిఫ్‌, శ్రీరాములు, దాదాపీర్‌, ఆనంద్‌, నాగార్జున, షౌకత తదితరులు పాల్గొన్నారు. 


బంద్‌కు పిలుపు  

హిందూపురం జిల్లా సాధన కోసం ఈనెల 29న హిందూపురం బంద్‌కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. వ్యాపార వర్గాలు, ప్రజలు బంద్‌కు సహకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2022-01-28T05:48:44+05:30 IST