ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-11T04:52:34+05:30 IST

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యా యం జరుగుతోందని ఎం ఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 19వ రోజు నిరసన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట డప్పు వాయించి కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు.

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 10: ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యా యం జరుగుతోందని ఎం ఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 19వ రోజు నిరసన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట డప్పు వాయించి కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోహర్‌, వైసీపీ నాయకులు రాము, దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:52:34+05:30 IST