సంక్షేమంలో చేనేత కార్మికులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-07T05:00:30+05:30 IST

మదనపల్లెలో వేలాదిగా వున్న చేనేత కార్మి కుల్లో అర్హులకు కూడా సంక్షేమపథకాలు అందకుండా చేస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు జె.భవానిప్రసాద్‌ ఆరోపించారు.

సంక్షేమంలో చేనేత కార్మికులకు అన్యాయం
నీరుగట్టువారిపల్లెలో బాదుడే బాదుడు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 6: మదనపల్లెలో వేలాదిగా వున్న చేనేత కార్మి కుల్లో అర్హులకు కూడా సంక్షేమపథకాలు అందకుండా చేస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు జె.భవానిప్రసాద్‌  ఆరోపించారు. శనివారం స్థానిక నీరుగట్టువారిపల్లెలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే..బాదుడు కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి యశశ్విరాజ్‌ మా ట్లాడుతూ మదనపల్లెలో అధిక సంఖ్యలో వున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేనేత పథకాలలో కోత కోసేందుకు నిబంధనలు పెడుతున్నారని, దీని వలన వందలాది మంది చేనేత కార్మికుల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు చాణు క్యతేజ్‌, మేకలరెడ్డిశేఖర్‌, ఎస్‌ఏ మస్తాన్‌, నీలకంఠ, చంద్రశేఖర్‌, సోమశే ఖర్‌, ఆర్‌జేవెంకటేశ్‌, నరసింహులు, చంద్రశేఖర్‌, నవీన్‌ పాల్గొన్నారు.

పెంచిన ధరలు తగ్గించాలి


పెద్దమండెం, ఆగస్టు 6:ప్ర భుత్వం పెంచిన విద్యుత్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలను వెంటనే తగ్గించాలని మం డల టీడీపీ కన్వీనర్‌ వెంక టరమణ డిమాండ్‌ చేశా రు. మండలంలోని కలిచె ర్ల, గుర్రంవాండ్లపల్లె, బండ్రేవు గ్రామాలలో శనివారం బాదు డే.. బాదుడు నిర్వహించారు. కలిచెర్లలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు నాటరాజ్‌నాయక్‌, మండల ప్రధాన కార్య దర్శి కాలేషా, నాయకులు శేషాద్రి, మోహన్‌, మధుకర్‌, శ్రీనివాసులు, చౌడప్ప, రసూల్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-07T05:00:30+05:30 IST