బ్రావోకు గాయం.. టోర్నీకి దూరం?

ABN , First Publish Date - 2020-10-19T08:51:38+05:30 IST

రుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ అవకాశాలు ప్రమాదంలో పడిన సీఎ్‌సకేకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ డ్వేన్‌ బ్రావో గజ్జల్లో గాయంతో టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

బ్రావోకు గాయం.. టోర్నీకి దూరం?

షార్జా: వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ అవకాశాలు ప్రమాదంలో పడిన సీఎ్‌సకేకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ డ్వేన్‌ బ్రావో గజ్జల్లో గాయంతో టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ‘అతడు టోర్నీలో కొనసాగుతాడా లేదా అన్నది అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికైతే ఆ గాయంతో బ్రావో కొద్ది రోజు లు లేదా వారాలు ఆటకు దూరం కాక తప్పదు’ చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ ఆదివారం వెల్లడించాడు. కుడి గజ్జల్లో అయిన గాయంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారంనాటి మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను బ్రావో వేయలేకపోయాడు. 

Updated Date - 2020-10-19T08:51:38+05:30 IST