తనకల్లు, జనవరి 20: మండల కేంద్రమైన తనకల్లులోని బీసీ బాలికల వసతి గృహంలో మండలంలోని బుడ్డయ్య కోటకు చెందిన దీపిక తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో 7వ తరగతి చదువు తోంది. బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ పాఠశాలకు సైకిల్‌పై వెళ్లి, వస్తూ ఉండే ది. గురువారం ఉదయం సైకిల్‌పై వసతి గృహం నుండి పాఠశాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న చిన్నరా మన్నపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొ నడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యా ర్థినికి గాయాలు కాగా 108 వాహనంలో తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథ మ చికిత్సను నిర్వహించిన తనకల్లు వైద్యులు మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హాస్టల్ మ్యాట్రిన్ ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు.