విత్తనోత్పత్తికి శ్రీకారం!

ABN , First Publish Date - 2020-08-15T11:51:02+05:30 IST

బొబ్బిలి వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 22 యూనిట్లలో విత్తన వరి పంట సాగుకు ఈ ఏడాది రైతులు శ్రీకారం చుట్టారు. 1121 ర

విత్తనోత్పత్తికి శ్రీకారం!

బొబ్బిలి, ఆగస్టు 14:  బొబ్బిలి వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 22 యూనిట్లలో విత్తన వరి పంట సాగుకు ఈ ఏడాది రైతులు  శ్రీకారం చుట్టారు.  1121 రకం (శ్రీభృతి), 1064 (అమర), 1062 (ఇంద్ర) రకం విత్తనాలను 50 శాతం సబ్సిడీతో అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌ పరిధిలో 10 హెక్టార్లు (25 ఎకరాలు) చొప్పున విత్తన సాగు కోసం ఇప్ప టికే అన్నదాతలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.


బొబ్బిలి మండలంలో 8  యూనిట్లు, బాడంగి మండలంలో 4, తెర్లాం మండంలో ఒకటి, బలిజిపేట మండ లంలో 4 , సీతానగరం మండంలో 5 చొప్పున యూనిట్లను ఎంపిక చేశారు.  అయితే విత్తన సాగు చేసేవారికి అదనంగా ప్రోత్సాహకాలేవీ లేకపోవడం గమ నార్హం. అందరిలానే విత్తనాలను 50 శాతం రాయితీ లేదా కిలో రూ.10  ధర ప్రాతిపదికన ప్రభుత్వం సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటోంది. దీనిపై రైతులు పెదవి విరుస్తున్నారు.  విత్తనోత్పత్తి సాగు చేసే రైతులకు విజయనగరం రైతు శిక్షణ  కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో తర్ఫీదు ఇస్తున్నామని  వ్యవసాయ శాఖ ఏడీ మాలకొండయ్య, ఏవో మజ్జి శ్యామ్‌సుందర్‌ తెలిపారు.


రైతులు  తమ పొలాల్లో తయారు చేసుకునే విత్తనాలను మూడేళ్ల పాటు వినియోగించుకుంటూనే పంపిణీ చేసే వీలుందన్నారు. కేవలం కిలో రూ.5కే విత్తనాలను తయారు చేసుకున్నట్లవుతుందన్నారు.  విత్తన వరి పంటను సాగు చేసిన పొలాల్లో మూడు దశల్లో కేళీలను తొలగించుకోవాలని తెలిపారు.  వరి దుబ్బులు, వెన్ను కట్టినప్పుడు, కోత దశల్లో కేళీలను తొలగించుకుంటే నాణ్యమైన విత్తన వరి రైతు సొంతమవు తుందని చెప్పారు.


గొల్లపల్లి, కోమటిపల్లి , గోపాలరాయుడిపేట, అలజంగి, పక్కి, పిరిడి గ్రామాలలో విత్తన వరి సాగు ప్రస్తుతం  జరుగుతోందన్నారు. పెద్ద కమతాలున్న రైతులు తమ విత్తనోత్పత్తిని ఏపీ సీడ్స్‌ వంటి సంస్థలకు మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడించారు.  

Updated Date - 2020-08-15T11:51:02+05:30 IST