వీరయ్య అక్రమాలపై మొదలైన విచారణ

ABN , First Publish Date - 2022-05-19T05:22:18+05:30 IST

భూ వివాదాలు, ఆదినారాయణ హత్య కేసులో 13వ ముద్దాయిగా ఉన్న మాజీ ఇన్‌చార్జి తహసీల్దార్‌ వాడాల వీరయ్యపై బుధ వారం విచారణ చేపట్టారు.

వీరయ్య అక్రమాలపై మొదలైన విచారణ
ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌డీసీ శ్రీదేవి

ఫిర్యాదులపై  ఐదు టీంలతో పరిశీలన

నివేదికను కలెక్టర్‌కు పంపిస్తాం

ఎస్‌డీసీ శ్రీదేవి

ఎర్రగొండపాలెం, మే 18 : భూ వివాదాలు, ఆదినారాయణ హత్య కేసులో 13వ ముద్దాయిగా ఉన్న మాజీ ఇన్‌చార్జి తహసీల్దార్‌ వాడాల వీరయ్యపై బుధ వారం విచారణ చేపట్టారు. వీరయ్యపై ఈనెల 5వ తేదీన విచారణ సమయంలో పలువురి నుంచి ఫిర్యా దులు అందిన విషయం తెలిసిందే. ఈమేరకు ఎస్‌డీసీ శ్రీదేవి పర్యవేక్షణలో ఐదు టీములు విచారణలో పా ల్గొన్నాయి.  ఎర్రగొండపాలెం రెవెన్యూ పరిధిలో త్రిపురాంతకం రోడ్‌లోని సర్వే నెంబరు-94/2లో 0.17 సెంట్లు  ప్రభుత్వ భూమిని ఒక ప్రజాప్రతినిధి ఆక్ర మించి, 1బీ రిజిస్టర్‌ల నమోదు చేయించుకున్నట్లు అం దిన ఫిర్యాదుపై ఎస్‌డీసీ ఎం.శ్రీదేవి పరిశీలించారు. వైపాలెం కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు  వైపాలెం రెవెన్యూ పరిధి త్రిపురాంతకం రోడ్డులో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 94/2లో 0.17 సెంట్ల భూ మిని ఎంపీపీ డి.కిరణ్‌గౌడ్‌ ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌డీసీ శ్రీదేవి ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. ఆభూమికి చెందిన రికా ర్డులను చూశారు. విచారణ నివేదికను ఉన్నతాధి కారులకు పంపిస్తామని శ్రీదేవి తెలిపారు. 

 వీరయపై మొత్తం 46 ఫిర్యాధులు అందాయని ఎస్‌డీసీ తెలిపారు. విచారణలో బాగంగా మిల్లంపల్లి టోల్‌గేటు వద్ద జగనన్న కాలనీలో నివేశపట్టాల పం పిణీలో గోల్‌మాల్‌ జరిగింది. అర్హులకు పట్టాలు అం దలేదు. దీనిపై కూడా విచారణ చేశారు.  1316 మందికి   పట్టాలు సిద్ధం చేసి ప్లాన్‌ అప్రూల్‌ పొందగా, 1057 మందికి పట్టాలు పంపిణీ జరిగింది. మిగతా 259 మందికి పట్టాలు పంపిణీ చేయలేదు. వారికి పీఆర్‌కే నెంబర్‌ ఇచ్చినా పట్టాలు ఇవ్వలేదు. ప్రస్తుతం వా రంతా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు విచా రించారు.  

గుర్రపుసాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థలంలో తహసీల్దారు తమ కుటుంబీకుల పేరుతో టాయిలెట్స్‌ నిర్మించారని గ్రామస్థులు చేసిన ఫిర్యాదుపై ఒక టీం విచారణ చేపట్టింది.  ఆన్‌లైన్‌ చేయకుండా వీరయ్య ఇ బ్బందులు పెట్టాడని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో టీం విచారించింది.  ఈ విచారణలో తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, డీటీ, 10 మంది సర్వేయర్లు, ముగ్గురు వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఎస్‌డీసీ శ్రీదేవి తెలిపారు.


Updated Date - 2022-05-19T05:22:18+05:30 IST