వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-04-13T06:11:38+05:30 IST

వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెద్దలింగాపూర్‌లో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావుతో కలిసి రైతువేదిక, మహిళా సంఘభవనం, సహకార సంఘం గోదా ములను ప్రారంభించారు.

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం
ప్రారంభిస్తున్న రసమయి, రవీందర్‌రావు

- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 12: వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెద్దలింగాపూర్‌లో  నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌  కొండూరు రవీందర్‌రావుతో కలిసి రైతువేదిక, మహిళా సంఘభవనం, సహకార సంఘం గోదా ములను ప్రారంభించారు. తొలుత అనంతగిరిలో కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చెలిమెడ రాజేశ్వర్‌రావుతో కలిసి పాలకేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు.   రైతువేదికలు ఆధునిక దేవాలయాలన్నారు. రైతులను చైతన్యవంతులను చేసి రైతులు శాసించే రాజ్యం రాబోతోందన్నారు.  కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఫ్యాక్స్‌చైర్మన్‌ తిరుపతిరెడ్డి, సర్పంచులు పల్లె నర్సింహ్మరెడ్డి, గొడిశెల జితేందర్‌గౌడ్‌, ఎంపీటీసీలు గొట్టెపర్తి పర్శరాం, కరివెద స్వప్న, రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గొడుగు తిరుపతి, సహకారసంఘం డైరెక్టర్‌ గన్నారం వసంతనర్సయ్య, పాలకేంద్రం అధ్యక్షుడు ముత్యంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:11:38+05:30 IST