ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-06-30T05:56:50+05:30 IST

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి
మేడ్చల్‌ : డీఈవో కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందిస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

వికారాబాద్‌/మేడ్చల్‌ అర్బన్‌/బంట్వారం (కోట్‌పల్లి)/పరిగి/కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌/కులకచర్ల/బొంరాస్‌పేట్‌/, జూన్‌ 29 : రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తామని చెప్పి కనీసం మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం లేదని ఏబీవీపీ వికారాబాద్‌ జిల్లా కన్వీనర్‌ శకం సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. బుధవారం డీఈవో కార్యాలయంలో పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనా కనీసం పుస్తకాలు, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయలేదన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించినా ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు. బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని వారు పేర్కొన్నారు. 

  • వ్యాపార కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలు

పాఠశాల పేరుతో బోర్డు పెట్టుకుని పుస్తకాలు విక్రయిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ వికారాబాద్‌ జిల్లా కన్వీనర్‌ సతీష్‌ పేర్కొన్నారు. కాకతీయ, నారాయణ సెయింట్‌ జ్యూడ్స్‌ స్కూళ్లలో అమ్ముతున్న పుస్తకాలను పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేయగా.. అధికారులు సీజ్‌ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్‌, సాకేత్‌, గణేష్‌, అనిల్‌, గణేష్‌, అమర్నాత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి 

ప్రభుత్వం ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కొడంగల్‌ మండల శాఖ నాయకులు నిరసన తెలిపి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. బసప్ప, అశోక్‌కుమార్‌, ముత్యప్ప, శ్రీనివాస్‌, అంజి, నరేందర్‌, శ్రీనివాసులు, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలపై టీఎస్‌ యూటీఎఫ్‌ బొంరాస్‌పేట్‌ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ వహిదాఖాతూన్‌కు వినతిపత్రం అందించారు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో యూటీఎఫ్‌ నాయకులు గోపాల్‌, మల్లేశం, విజయలక్ష్మీ నిరసన వ్యక్తంచేసి వినతిపత్రం అందించారు. రాజశేఖర్‌, లక్ష్మీ, అలవేలు, వెంకటయ్య, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సూర్యనాయక్‌ పాల్గొన్నారు.

  • ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి

మేడ్చల్‌ జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అడ్డుకోవడంలో విద్యాధికారులు విఫలం అవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్‌  (ఎస్‌  ఎ్‌ఫఐ) జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటేష్‌ ఆరోపించారు. బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌, నాయకులు సాయి, రామ్‌ తదితరులున్నారు.

  • విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎ్‌సయూటీఎఫ్‌  జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రత్నం  పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్‌ఈపీ 20-20ని వెంటనే రద్దు చేయాలన్నారు. అనంతరం బంట్వారం మండల కేంద్రంలో యూటీఎఫ్‌ నాయకులతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అంగోత్‌ గోపాల్‌, ప్రభాకర్‌, నరేష్‌, రాజశేఖర్‌, సర్దార్‌, ఫరూక్‌, రవికుమార్‌, కొండయ్య, జాంగీర్‌, సంతోష్‌ కుమార్‌, రమేష్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలతోపాటు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీఎ్‌ఫఐ ఆధ్వర్యంలో పరిగి తహాశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్‌టీఎ్‌ఫఐ మండల కన్వీనర్‌ వెంకటయ్య మాట్లాడుతూ ఏళ్ళుగా పెండిండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పారిశుధ్య పనులను పంచాయతీలకు కాకుండా విద్యాశాఖ ద్వారా పర్యవేక్షించాలని కోరారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు లక్నాపూర్‌ శ్రీనివాస్‌, జమున, మొగులయ్య, ముగ్యా, హన్యంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • శిథిలావస్థలో ఉన్న పాఠశాలను బాగుచేయాలి

కొడంగల్‌ మున్సిపాలిటీలోని గాంధీనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో బడిని బాగుచేయాలని కోరుతూ యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాఠశాల ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కృష్ణంరాజు, తాలూకా అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శంకర్‌నాయక్‌, తార్యానాయక్‌, వెంకటప్ప, సాయిరెడ్డి, రవీందర్‌చారి తదితరులున్నారు.

  • ‘మన ఊరు-మన బడి’ని సక్రమంగా అమలు చేయాలి

మన ఊరు-మన బడి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ కులకచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రమేశ్‌, యు.రమేశ్‌లు మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్‌ను పునరుద్దరించాలన్నారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావాలంటీర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ ఉపాధ్యాయులు రాములు, శ్రీను, ఆనంద్‌, కృష్ణయ్య, శంకర్‌, రాజు, మల్లేశ్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:56:50+05:30 IST