52 వారాల కనిష్టానికి ఇన్ఫోసిస్.. ఒకే నెలలో 14% ఢమాల్..

ABN , First Publish Date - 2022-09-22T16:59:59+05:30 IST

వృద్ధిపై నెలకొన్న ఆందోళనల మధ్య ఇన్ఫోసిస్ షేర్లు (Infosys shares) గత నెల రోజులుగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

52 వారాల కనిష్టానికి ఇన్ఫోసిస్.. ఒకే నెలలో 14% ఢమాల్..

Infosys : వృద్ధిపై నెలకొన్న ఆందోళనల మధ్య ఇన్ఫోసిస్ షేర్లు (Infosys shares) గత నెల రోజులుగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. నేటి ఇంట్రా డే (Intra Day)లో కంపెనీ షేర్లు 1 శాతం పడిపోయి 52 వారాల కనిష్టం రూ.1360.15కు చేరుకున్నాయి. మొత్తానికి కంపెనీ స్టాక్ గడిచిన నెల రోజులలో 14 శాతం పతనమైంది. ఇదే సమయంలో ఎస్‌అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ (S&P BSE Sensex) ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది. 


ఐటీ స్టాక్ (IT Stock) గతంలో అంటే జూన్ 17, 2022న టచ్ చేసిన 52 వారాల కనిష్టం రూ.1367.20 నుంచి సైతం మరింత పతనమైంది. మే 2021 నుంచి స్టాక్ దాని లోయెస్ట్ లెవల్ వద్ద కోట్ చేస్తోంది. బుధవారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) మరో 75 bps రేటు పెంపును ప్రకటించిన తర్వాత, IT స్టాక్‌ల కారణంగా యూఎస్ మార్కెట్లు (US Markets) నష్టాల్లో ముగిశాయి. ఇక భారతదేశంలో IT స్టాక్‌లు కూడా బలహీనమైన గ్లోబస్ క్యూస్ (Globel Cues) నేపథ్యంలో గురువారం కూడా తక్కువగా ట్రేడ్ చేశాయి. 


ఉదయం 09:35 గంటలకు సెక్టోరల్ ఇండెక్స్‌ (Sectoral Index)లలో టాప్ లూజర్‌లలో ఒకటైన నిఫ్టీ IT ఇండెక్స్ 0.50 శాతం పతనమై 26,710కి చేరింది. నిఫ్టీ 50లో 0.20 శాతం క్షీణించాయి. IT ఇండెక్స్ ఇంట్రా-డే కనిష్టానికి చేరింది. ఐటీ ఇండెక్స్ (IT Index) ఇంట్రా డే కనిష్టం 26,552కి చేరింది. అలాగే ఎన్ఎస్ఈ (NSE)లో 52 వారాల కనిష్ట స్థాయి 26,189 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ (Infosys)తో పాటు విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) ఒక్కో శాతం చొప్పున క్షీణించాయి.



Updated Date - 2022-09-22T16:59:59+05:30 IST