సందేశాత్మకంగా సాగుతున్న నాటిక పోటీలు

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరుగుతు న్న నాగులపాలెం కళా వాణి నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నా యి.

సందేశాత్మకంగా సాగుతున్న నాటిక పోటీలు
కొండంత అండ నాటికలోని ఓ సన్నివేశం

పర్చూరు, మే 19: పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో  జరుగుతు న్న నాగులపాలెం కళా వాణి నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నా యి. మూడవరోజు బుధవారం జరిగిన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ప్రేక్షకు లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కళావాణి అధ్యక్షుడు కొల్లా సుభాష్‌బా బు, చాగంటి నాగేశ్వరరావు, పాబోలు ఉ దయభాస్కర్‌, కేఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, కొల్లా నరేంద్రకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

ఆలోచన రేకెత్తించిన కొండంత అండ..

స్వార్థంతో బతుకుతున్న రోజుల్లో కష్ట సమయాల్లో ఉన్న రైతుకు చాటి రైతు కొండంత అండగా నిలబడుతున్న వైనాన్ని స్నేహ ఆర్ట్స్‌ ఇంజనంపాడు వారు కొండంత అండ నాటిక ద్వారా చాపారు. ఆరు గాలం కష్టించే అన్నదాత ఒక వైపు పంట తెగుళ్ళు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటుంటే.. మరోవైపు అందివ చ్చిన బిడ్డల సా యం అందక రైతు విలవిల లాడుతున్న తీరు పేక్షకు ల్ని ఎంతగానో ఆలోచింపజేసింది. నేడు బిడ్డలకు కావాల్సింది ఆస్తులే కానీ వారి కష్టసుఖాలు కావని ఈ నాటిక ద్వారా కళాకారులు ప్రదర్శిం చారు. 


రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న ఆర్థిక విధానాలు

మంచి కోసం వ్యవసాయం చేద్దాం.. పది మందికి ఉపయోగపడే పంటలు పండిద్దాం అనే సందేశాన్ని ఇచ్చింది ప్రియదర్శిని నెల్లూరు వారు ప్రదర్శించిన వ్యవసాయ నాటిక. రైతు నాగలి వదివేస్తే స మాజం అకలితో అలమటిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు రై తుకు వెన్నుపోటు పొడుస్తున్న ఆర్థిక విధానాల తీరును ఎండకట్టారు కళాకారులు. ఆత్మభిమానం చంపుకోలేక ఆకలితో చచ్చిపోతున్న రైతు తీరుపై కళాకారుల ప్రదర్శన ప్రేక్షకుల కంటతడి పెట్టించింది. ఆఽధర్మం ఎంతోకాలం కొనసాగదని, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని రైతు ధర్మ య్య పాత్ర ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు రచయిత జీబీకే మూర్తి. 


అమ్మ భూదేవి అయితే నాన్న ఆకాశం..

అమ్మ భూదేవి అయితే నాన్న ఆకాశం... నాన్న ఔన్నత్యాన్ని బిడ్డల పై ప్రేమాభిమానాన్ని ఎత్తి చూపుతూ మిత్ర క్రియేషన్స్‌ హైదరాబాద్‌ నాటిక ద్వారా చూపారు. తల్లిలేని బిడ్డల ఆలనా పాలనా చూసే తండ్రి గొప్పతనాన్ని బిడ్డలు చేసిన తప్పును గుండెలో దాచుకునే తం డ్రి మహోన్నత వ్యక్తిత్వాన్ని చక్కగా కళాకారులు తమ కళాప్రదర్శన ద్వారా వివరించారు.


అహం వీడితేనే  మానసిక ప్రశాంతత

పెళ్ళి అయిన కూతురు భర్త వదిలేసి తన ఇంటిలో ఉంటే తండ్రి ఎంత మానసిక వ్యధకు గురవుతాడే కెరటాల నాటిక ద్వారా కళాకా రులు చూపారు. భారతీయ వివాహ వ్యవస్థ ప్రాధాన్యత నేటి యువ త క్షణికావేశాలతో విడిపోయి తద్వారా తల్లిదండ్రులను మానసిక క్షభకు గురిచేస్తున్న వైనాన్ని సాయిరాఘవ మూవీ కంబైన్స్‌ గుం టూరు కళాకారులు ఈనాటిక ద్వారా చూపారు.

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST