మాట్లాడుతున్న షీ టీం జిల్లా ఇంచార్జీ మహ్మద్ సిరాజ్‌ఖాన్
జైనూరు, మే 18: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బాలికలు, మహిళలను ఎవరైనా వేధించినట్లయితే సమాచారం అందించాలని షీం టీం జిల్లా ఇన్‌చార్జీ మహ్మద్ సిరాజ్‌ఖాన్ కోరారు. మండలం లోని బాలికల ఆశ్రమోన్నత పాఠశాల రాసిమెట్టలో బుధవారం ఆయన షీటీంతో కలిసి ప్రత్యేక ఆవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహి ళల రక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీంని ఏర్పాటు చేసిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు 79016 74838, 9346987214 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయనకోరారు. అవగాహన సద స్సులో పాఠశాల హెచ్‌ఎంపార్వతీబాయి, పాఠశాల సిబ్బంది, షీటీం సిబ్బంది పాల్గొన్నారు.